MAA GNAPAKALU by SIVARAJU SUBBALAKSHMI Telugu book cover

MAA GNAPAKALU

by SIVARAJU SUBBALAKSHMI

₹100
In stock · 568 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
MAA GNAPAKALU By Sivaraju Subbalakshmi "చివరకు మిగిలేది" లాంటి గొప్ప మనోవైజ్ఞానిక నవలను రచించి, ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచంలో స్థిరమైన స్థానాన్ని పొందిన బుచ్చిబాబుగారి సతీమణి సుబ్బలక్ష్మిగారు ఒకప్పటి తన జ్ఞాపకాల్ని ఇప్పుడీ పుస్తకరూపంలో మనకందించారు. జ్ఞాపకాలనేవి కేవలం వ్యక్తిగతమైనవే అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా సుబ్బలక్ష్మిగారి జ్ఞాపకాలు ఆనాటి సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలే కావడం వల్ల పందొమ్మిదివందల యాబైలలోనూ, అరవైలలోనూ తెలుగు సాహితీ ప్రపంచానికి చెందిన ఎందరో ప్రముఖుల ప్రస్తావన ఆమె జ్ఞాపకాల్లో పదే పదే వస్తుంటుంది. బుచ్చిబాబులాగే సుబ్బలక్ష్మి కూడా ఒక సృజనాత్మక రచయిత్రే కావడం వల్ల వాళ్ళెక్కడున్నా, వాళ్ల ఇల్లొక సాహితీ కేంద్రంగా ఉండేది. అందువల్ల దేవులపల్లి కృష్ణశాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, ఆచంట జానకీరాం, విశ్వనాథ సత్యనారాయణ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, బి.ఎన్.రెడ్డి లాంటి ఎందరో మహామహులు ఈ దంపతుల ఇంటికి తరచుగా వస్తుండేవాళు అలాగే ఆనాటి స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీగారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని వీళ్ళు కలుసుకోవడం, వాళ్ళ ఉపన్యాసాలు వినడం లాంటి ఎన్నో ఉదంతాలను కూడా సుబ్బలక్ష్మిగారు తన జ్ఞాపకాల్లో ఉదహరించారు. ఆమె మన ముందుంచిన ఈ జ్ఞాపకాలను చదువుతుంటే ఆమె మన పక్కన కూర్చొని మనతో ముచ్చటిస్తున్నట్టుగానే ఉంటుంది.