MAA OORI SATAKAMU (GNAPAKA SAKTHI) by ILLA MURALIDHARA RAO Telugu book cover

MAA OORI SATAKAMU (GNAPAKA SAKTHI)

by ILLA MURALIDHARA RAO

₹75
In stock · 384 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126580
Maa Voori Sathakamu (Gnaapaka Sathi) By Illa Muralidhara Rao మీకు స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన మనసులున్న పల్లెటూరంటే ఇష్టమా? ఐతే ఈ శతకం మీకోసమేనండీ. చదవండి. భావంతో సహా. పల్లెల్లో పుట్టినవారికి ఇది మావూరే ననిపిస్తుంది. పల్లెల్లోని ఆచారాలూ, పండుగలూ, నమ్మకాలూ... ఒకటేమిటి పల్లెజీవనపు పదనిసలన్నీ ఇందులో ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో పుట్టినవారికి 'నేనెందుకు పల్లెటూరిలో పుట్టలేదా' అని పల్లెజీవనంపై ఆసక్తిని కలిగిస్తుంది. అద్భుతమైనవి, అబ్బురమైనవి, ఆకర్షణీయమైనవి, సంస్కారవంతమైనవి అయిన మన జానపద కళారూపాలు అంతరించిపోకుండా, తక్షణమే వాటికి పునః ప్రాణప్రతిష్ఠ జరగాలనే తపన కూడా ఇందులో పొందుపరిచాను. పల్లెసీమలు అన్నం పెట్టే అన్నపూర్ణలు. అవి పచ్చగా కలకాలం విలసిల్లాలి. పుట్టిన ఊరిని ఎవరూ మరిచిపోకూడదు. ఉన్న ఊరు - కన్నతల్లి అన్నారు కదండీ. మా ఊరంటే నాకిష్టం. అయినా నాకేనా? పుట్టిన ఊరంటే ఎవరికిష్టముండదు? భావంతో సహా ఉన్న ఈ పుస్తకం చదవండి. మీరూ మీ ఊరిని ఇష్టపడతారు. నాది హామీ. ఇళ్ళ మురళీధరరావు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-48126-58-0