
MAA TOLINATI KATHALU SUPRAJA
by DR.PELLAKURU JAYAPRADA SOMIREDDY
₹120
In stock · 47 available
PublisherDR.PELLAKURU JAYAPRADA SOMIREDDY
LanguageTelugu
“ఓ పువ్వు పూసింది" హిమగిరి మాసపత్రిక - డిశంబరు, 1985 అప్పుడే తలుపు తట్టిన పార్వతమ్మ మీద తలుపుతీసి వాలిపోయింది కూతురు "సుమలత". ఆ క్షణంలో పార్వతమ్మకు తెలీకుండానే ఆకాశం మీద పడ్డట్టు కంగారు కలిగింది. సుమలత కళ్ళేవో మొరెట్టుకోవాలని తల్లివైపు చూశాయి. 'రాత్రి కబుర్లేంటో చెప్పవే... జాగారం చేసినట్లుంది. నీవు చెప్పకపోయినా నీ పీక్కుపోయిన కళ్ళు చెప్తున్నాయిలే...' అంది మేనత్త పద్మావతి నవ్వుతూ, 'ముందు అమ్మాయిని స్నానం చేయనీ... ఆ తర్వాత నీ పరాచికాలన్నీ మొదలెట్తువు... అంది పార్వతమ్మ తన కంగారుని కప్పేసే ప్రయత్నంలో, చిరునవ్వును చిదుముతుందనుకున్న 'సుమలత' నిస్పృహగా... కసిగా... కలగాపులగంగా తయారైన కళ్ళనుచూసి ఏమీ అర్ధంకాక కాస్త దగ్గరికొచ్చి తల నిముర్తూ క్షణం అదిరిపడింది పార్వతమ్మ. మాటకు మాట క్షణమాలస్యం లేకుండా జవాబిచ్చే సుమలత మౌనంగా వుండడంతో మేనత్త సుమలతను తేరిపారజూసింది. రాత్రి వేసిన మల్లెపూల జడ బాగా విచ్చుకొని చెక్కు చెదరకుండా వుండడం చూసి గతుక్కుమనిపించింది. బతకనని తెలిసిపోయినవాడు భయాన్ని అధిగమించి, నిబ్బరంగా చూస్తున్నట్లుగా సుమలత వాళ్ళవైపు చూసింది. 'ఏమన్నాడు? ఏమైంది? అని