
MAANASARA VASTUSASTRAM
₹1,200
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
పీఠిక మన భారతదేశపు ప్రాచీనవిద్యలలో వాస్తువిద్యయొకటి. ఇది వేదాంగముగ కూడా ప్రశస్తి పొందినది. "స్థాపత్యంచాసృజద్ క్రమాత్ పూర్వాదిభిర్ ముఖైః" అని భాగవతము చెప్పినది. "స్థాపత్యవేదో అధర్వణస్య ఉపవేదః" అని శౌనకీయ చరణవ్యూహమను గ్రంథము వాకొనుచున్నది. స్థాపత్యములో వాస్తువు అంతర్భాగము. ఈ వాస్తుశాస్త్రములను మన పూరులైన మహర్షులు ప్రసాదించిరి. వీనిలో ఎనిమిది, పదునారు, పదునెనిమిది, ముప్పది రెండు సంఖ్యలతో వివిధ మహర్షులు ఈ శాస్త్రమును వెలయించిరని, లోకములో ఈ శాస్త్రము వ్యాప్తిపొందుటకు తగిన కృషి సలిపిరని తెలియుచున్నది. "కృగురత్రిర్వశిష్టశ్చ విశ్వకర్మామయస్తథా" అని మత్స్యపురాణము (అధ్యాయం 252) 18 మంది మహర్షులను పేర్కొన్నది. అట్టి మానసారవాస్తుశాస్త్రమున 32 శాస్త్రములను వాని ప్రవర్తకులైన మహర్షులను గూర్చి చెప్పబడినది (అధ్యాయం 68) విశ్వకర్మాచ విశ్వేశ విశ్వసార: ప్రభోదక: మానవిన్మా కల్పశ్చ మానసారోబహుశ్రుత: అని మానసారఋషిని గూర్చి చెప్పినది. ఇట్లు ఋషులు, ఆచార్యులు, మహాత్ములు చేసిన కృషి వలన ఈ శాస్త్రము లోకములో సర్వజనోపయోగకరమైనదిగా నిలిచినది. ఈ శాస్త్రము పఠన పాఠనములతో నేటికిని ప్రజాభిమానముతో విలసిల్లుచున్నది. పురోహితవృత్తిలో ఉన్నవారు, జ్యోతిష వృత్తిలో ఉన్నవారు, నిర్మాణరంగములో ఉన్నవారు, వ్యాపార రంగములో ఉన్నవారు ఈ శాస్త్రము సహాయముతో వారి వారి రంగములందు రాణించుచున్నారు. తక్కిన మన ప్రాచీన శాస్త్రములకు వలెనే ఈ శాస్త్రము కూడా సంస్కృత భాషలోనే ఉన్నది. కాని సంస్కృత పండితులు ఎక్కువగా కావ్య-వ్యాకరణ- అలంకారాది శాస్త్రములను మాత్రమే వాడుచూ ఈ శాస్త్రము విషయమై కాలసత్వము వహించుటచే ఈ గ్రంథములు లేఖకదోషములతో నిండి యుండినవి. అట్లే భారతదేశమున వివిధ ప్రాంతములలో, వివిధ నివులలో వ్రాయబడి యుండినవి. వానిని సేకరించి సంస్కరించి సరియైన పాఠ నిర్ణయము చేసి ప్రకటించుటలో తక్కిన శాస్త్రములకన్న ఆలస్యముగా ఈ గ్రంథములను పండితులు గ్రహించుట జరిగినది. ఐనను బలవంతమైన సంప్రదాయమొకటి నిలచి యున్నందున గ్రంథముల సహాయముకన్న ఆచార్యముఖమున నేర్చిన విద్యతోనే ఈ దేశమున వాస్తునిర్మాణములన్నియు రూపుగొన్నవి. భారతదేశమున ఆసేతు శీతాచలము వెలసిన బృహత్తర, మహత్తర నిర్మాణములు, దేవలములు, రాజహర్మ్యములు, కోటలు, దుర్దములు, సేతువులు, ఉద్యానములు, దిగుడు బావులు, బావులు, జలసించన యంత్రములు, గిరి దుర్గములు మొదలైనవి చూచిన విదేశీయులెందరో మన పూర్వుల నిర్మాణ కౌశలమును, యాంత్రిక, తాంత్రిక పరిజ్ఞానమును ప్రశంసించియున్నారు. భారతదేశమున ప్రాచీన నగరములైన హరప్పా, మహెంజోదారో నగరములను కనుగొన్న పాశ్చాత్య విద్వాంసులు మన పూర్వుల వాస్తు నిర్మాణవైశద్యమునకు ముగ్ధులై వాస్తుశాస్త్ర గవేషణమునకు కడంగినారు.