MAAYA KAMBALI - PILLALA KATHALU BOMMALATHO by KALUVAKOLANU SADANANDA Telugu book cover

MAAYA KAMBALI - PILLALA KATHALU BOMMALATHO

by KALUVAKOLANU SADANANDA

₹50
In stock · 576 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. మాయ కంబళి పూర్వం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆత్మానందుడనే వృద్ధ సన్యాసి ఉండేవాడు. ఆ దరిదాపులలోని ప్రజలంతా తరచుగా ఆయన్ని సందర్శిస్తూ, తమ లౌకిక సమస్యల్ని ఏకరువు పెట్టి, పరిష్కార మార్గాలు సూచించమని వేధించేవాళ్ళు. ఆత్మానందుడి ప్రశాంతతకు భంగం కలగసాగింది. ఈ ప్రతిబంధకం లేకుండా చేసుకోటానికి ఆయన ఒక ఉపాయం ఆలోచించాడు. తన పాత కంబళిమీద మంత్రజలం చల్లి, దానికొక మహిమను కలగజేశాడు. ఆయన దాన్ని కప్పుకున్నప్పుడు ఎవరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఓరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక కొండమీద తిరుగాడుతుండగా, కాలుజారి, లోయలోకి దొర్లిపడి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి మరోవైపున, దూరంగా పడిపోయింది. మరికొంత సేపటికి పాతదుస్తులు అమ్మేవాడొకడు శోభావతీ నగరంలో జరిగే సంతకు వెళుతూ, తన కంచరగాడిదతో బాటు ఆ కనుమ దారివెంట వచ్చాడు. కంబళి వాడి కంటబడింది. వాడు దాన్ని పైకి తీసి చూశాడు. దాన్నిండా చిరుగులు. ఏదో ఒక ధరకు ఏ పేదవాడైనా కొనకపోతాడా అని, వాడు దాన్ని మడిచి మూటలో పెట్టి ముందుకు సాగాడు.