MADAYA GARI MALLANA RAJASEKHARA CHARITRAMU by BETHAVOLU RAMABRAHMAM Telugu book cover

MADAYA GARI MALLANA RAJASEKHARA CHARITRAMU

by BETHAVOLU RAMABRAHMAM

₹300
Currently out of stock
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
నా మాట 'పద్యాలంటే మాకు ఇష్టం. చాలా అభిమానమూ గౌరవమూను. అయితే, మహాకవుల కావ్యాలను మా అంతట మేము చదివి, అర్థం చేసుకోగల్గిన శక్తి మాకు లేదు. ఎవరైనా చేయూత అందించాలి. కొన్ని కావ్యాలకు వ్యాఖ్యానా లున్నమాట వాస్తవం. కానీ ఆ వ్యాఖ్యానాలన్నీ ప్రౌఢగ్రాంథికభాషలో ఉన్నాయి. పైగా వాటిలో కనిపించే ఛందోవ్యాకరణాలంకారాదుల సుదీర్ఘ చర్చలూ, నిఘంటువుల ఉట్టంకింపులూ వగైరాలు మాకు తలకుమించిన బరువులు. అనవసరమైన బరువులు మా తలకు ఎత్తకుండా, హాయిగా చదువుకోడానికి వీలైన వాడుక తెలుగులో, పద్యాలను మాకు వివరించి చెప్పే వ్యాఖ్యానం కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే- మమ్మల్ని భయపెట్టని వ్యాఖ్యానం కావాలి!' ఇది ఈనాటి పద్యప్రియుల్లో అధికసంఖ్యాకుల ఆకాంక్ష. వీరికోసమే రూపొందింది - ఈ 'పాఠకమిత్ర' వ్యాఖ్య. పద్యాన్ని అర్థం చేసుకోవడంలో మొదటి అవరోధం- 'పదవిభజన'. రెండవది 'అన్వయక్రమం'. మూడవది కొత్తపదాలకు అర్థాలు వెతుక్కోవడం. మొదటి రెండు అడ్డంకులనూ తీరుస్తూ ఈ 'పాఠకమిత్ర' వ్యాఖ్యానంలో 'అన్వయం' అనేది అగ్రభాగాన నిలుస్తుంది. కొత్తపదాలను కుండలీకరణల్లో చూపుతూ పద్యానికి సమగ్రంగా అర్థవివరణ 'వ్యాఖ్యానం' తో అందుతుంది. ప్రామాణికతకోసం, సంశయనివృత్తికోసం, పాఠకులశక్తిని ఇనుమడింప జేయడంకోసం నిఘంటువుల్ని ఉట్టంకించడం, పాఠాంతరాలను చూపించడం, వ్యాకరణాంశాలను ప్రస్తావించడం- ఇత్యాదులన్నీ దికృదర్శనగా 'విశేషాలు' అనే శీర్షికతో అవసరమైన తావుల్లో కనిపిస్తాయి. వెరసి మూడు ఉపశీర్షికలతో వాడుక తెలుగులో ఈ వ్యాఖ్యానం పాఠకులకు నెచ్చెలిగా నడుస్తుంది. నడిపిస్తుంది. పద్యం చదివి, ఆ తరువాత ఈ 'పాఠకమిత్ర' వ్యాఖ్యానం చదివి, మరోసారి మళ్ళీ పద్యం చదివితే- అదింక పాఠకుడికి కరతలామలకమే!