
MADHULATHA
₹150
In stock · 104 available
PublisherV.LAKSHMI NARASAMAMBHA
LanguageTelugu
ఈ నవల ఎందుకు వ్రాశాను అంటే... ఎప్పుడు పుట్టిందో ఈ "కులం" ఎన్ని వేల సంవత్సరాల నుండి ఉందో? ఇప్పటికీ మన జీవితాల్ని శాసిస్తుంది. ఒక ప్రక్క వ్రాసుకున్నాం మన రాజ్యాంగంలో అందరూ సమానమే అని, న్యాయం, ధర్మం అందరికీ సమానంగా వర్తిస్తాయని...కాని నిజానికి జరుగుతున్నది ఏమిటి? మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అన్ని దేశాల ప్రజల లాగా మనం కూడా వసుధైక కుటుంబం వైపు అడుగులు వేస్తున్నాం! విశ్వభాష, విశ్వవిజ్ఞానం, విశ్వ సాంకేతికతలను అలవరచుకుంటున్నాం.! కానీ మానవులంతా సమానమే అన్న మాట మరచి పోతున్నాం! ప్రపంచ చదువులు చదివి, వడివడిగా అడుగులు వేసి, నేటి యువత ఆ వయస్సుకు సహజమైన ప్రేమలో పడుతోంది. తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటోంది. సమాజం కట్టుకున్న కులమతాల అడ్డుగోడలు వారికి కనబడడం ໖.! "Children come from us, but not through us" ໑໐ -మన నుండే పుడతారు కానీ... మన లాగానే ఉండరు. వాళ్ళ ఆశలు, ఆలోచనలు వేరుగా ఉంటాయి అనే సత్యాన్ని పెద్దతరం గుర్తించకుండా ఉంది. బిడ్డల సంతోషమే మన సంతోషం అనే విషయాన్ని వారి వివాహ విషయంలో తల్లిదండ్రులు అంగీకరించలేకుండా ఉన్నారు. కారణం? కులం అనే అదృశ్య శక్తి వారిని వివసుల్ని చేస్తుంది. వారు తాము కన్నవారిని, లేక వారిని కట్టుకున్న వారిని చంపుకునేంత కఠినంగా తయారు అవుతున్నారు. ఇది ఒక మానసిక సమస్యగా మొదలు అయి, వ్యక్తిగత సమస్యగా మారి, ప్రస్తుతం సామాజిక సమస్యగా తయారైంది. ఇందరి జీవితాలను అతలా కుతలం చేస్తున్న ఈ 'కులం' ఏమిటి? దీని పుట్టుక, రూపం ఎలాంటివి? ఇది సత్యమా? మిథ్యా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ- ఈ నవల వ్రాసాను. ఈ నవల సభ్యసమాజాన్ని ఆలోచింపజేస్తుందని, ముఖ్యంగా యువత 'కులం' లేవనెత్తె సమస్యల పైన స్పందిస్తారని వారే ఈ సమాజాన్ని 'కుల విముక్త' ను చేస్తారని ఆశిస్తున్నాను.