MADHUMEHAM (NIVARANA-NIYANTRANA) - 35 by TANGIRALA CHAKRAVARTHI Telugu book cover

MADHUMEHAM (NIVARANA-NIYANTRANA) - 35

by TANGIRALA CHAKRAVARTHI

₹35
In stock · 2 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
ఈనాడు విశ్వప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి మధుమేహం. ఆంగ్లంలో "డయాబెటిస్" (షుగర్) వ్యాధి అంటారు. భూమి ఎప్పుడు పుట్టిందీ అనే విషయం పరిశీలిస్తే మూడు వందలకోట్ల సంవత్సరాలక్రితం అని కొందరు... ఐదు వందల కోట్ల సంవత్సరాలు అని వైజ్ఞానికులు లెక్కలు తేల్చారు. ఆ తర్వాత ఆధునిక మానవుని వయస్సు దాదాపు ఒక్కటి రెండు లక్షల సంవత్సరాల మధ్యలో ఉంటుంది - మానవ శరీరావయవాల వికాసంతో (కోతినుండి రూపాంతరం చెందుతూ...) సంపూర్ణ మానవుడు ఆవిర్భవించాడు. ఆంత్రోపయాజ్ జీవినుండి మానవుడు పుట్టాడని సైన్స్ తేల్చింది. క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల క్రిందటే భారతీయ వైద్యపితామహుడు సుశ్రుతుడు ఈ 'మధుమేహం' వ్యాధిని పసిగట్టాడు. “తియ్యటి మూత్రం అధికంగా విసర్జించడం" అని నిర్వచించాడు తన వైద్య ప్రామాణిక గ్రంథాల్లో.... ఆయన తన సుశ్రుత సంహితలో వివరంగా రాశాడు. "ద్రవ పదార్థాలు శరీరంలో ఉండకుండా త్వరలో విసర్జించబడతాయని” క్రీ.శ. రెండవ శతాబ్దంలోని టర్కీ నివాసి అరేటియస్ అభిప్రాయం. 'డయాబెటిస్' అని పేరు పెట్టింది కూడా అరేటియస్. ఆనాటినుండి ఈనాటిదాకా 'ఈ మధుమేహ' వ్యాధిపై పాశ్చాత్య వైద్యులు అనేక ప్రయోగాలు; మందులు... నివారణా మార్గాల్ని అన్వేషిస్తూనే తమ పరిశోధనలు - ప్రయోగాలు - కొనసాగిస్తున్నారు. 1921లో బేంటింగ్; బెస్ట్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు "ఇన్సులిన్” కనిపెట్టడంతో మధుమేహరోగుల్లో నూతన (శకం) అధ్యాయం ఆరంభమైంది.