
MADHURA KATHA KADAMBAM
by DR.POTHINENI VASUNDHARA DEVI
₹70
In stock · 44 available
PublisherDR.POTHINENI VASUNDHARA DEVI
LanguageTelugu
అమృత భాండం ఆరోజు శనివారం కావడం చేత, నాలుగు ఆటలు ఎక్కువ వేసికొందాం అని ఫ్రెండ్సు బలవంతం చేశారు క్లబ్బులో. రేపు ఆదివారం ఎంతసేపైనా పడుకోవచ్చుగదా! అక్కడే మందు, డిన్నరు అయిందనిపించారు అందరూ. జేబులో వైబ్రేషన్లో వున్న ఫోను తీశాడు. భార్య శ్యామల "బయలుదేరేరా" అంటూ. "ఆ ఏం" చిరాగ్గా అన్నాడు. ఆ స్వరమే అంత. "ఏం కొంపలంటుకుపోతున్నాయ్” అన్న రేంజిలో. కాని శ్యామల కంఠంలోని 'ఒణుకు' కొంచెం గాభరా కలిగించింది. "మీ అమ్మగారు పిలిచినా పలకడం లేదు. త్వరగా రండి" ఆ ఫోనులో సారాంశం. ఫ్రెండ్సు కూడా వెంట వచ్చారు. నా భార్య శ్యామల, కూతురు రమ, అబ్బాయి రాకేష్ ఏడుస్తూ అమ్మ మంచం ప్రక్కన నిలబడి వున్నారు. నేను సాయంత్రం 4 గంటలకు ఇంటినుంచి బయలుదేరేముందు ఎప్పటిలా బాగానే వుంది అని నేను అనుకొనివుంటాను. పరికించి చూస్తే మనిషి ముఖంలో ఏమైనా బాధగాని, అలసటగాని కనిపించేదేమో! శ్యామల నన్ను చూడగానే బావురుమంటూ ఏడ్చేస్తోంది. నేను స్థాణువై నిలబడిపోయాను. అరగంట ముందే మంచినీళ్ళు అడిగి, త్రాగిందట. పిల్లలకు భోజనం పెడుతూ, అమ్మకు కూడా పెడదామని గదిలోపలికి వెళ్ళిందట.