
MADHURA SWAPNAM - RAHUL SANKRITYAYAN
₹210
In stock · 447 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
‘సింహ సేనాపతి', ‘జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చరిత్రాత్మక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్ (ఈరాన్)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను వ్రాయడం పడలేదు. ఈ నవల ద్వారా చరిత్రలో మరుగున పడిన ఒక పుటను పాఠకుల ముందు ఉంచడానికి ప్రయత్నించాను. నేనీ ప్రయత్నంలో ఎంతవరకు కృతకృత్యుణ్ణయ్యానో రసజ్ఞులైన పాఠకులు చెప్పాలి! నా ఇతర చారిత్రక నవలల్లాగానే, ఈ నవలలోనూ కొన్ని లోపాలున్నాయని నేను ఒప్పుకుంటాను. చరిత్రలో అట్టడుగునపడి కనిపించని పాత్రలు ఎన్నో వున్నాయి. ఆ పాత్రలు నాకు ప్రోద్బలాన్ని ఇచ్చాయి. ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా, తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని కోల్పోని ఆ పాత్రలే నాచేత ఈ నవలను వ్రాయించాయి! ఈ నవలలోని కథ క్రీస్తుశకం 492-529 మధ్యకాలంలో జరిగింది. కథాస్థానం మధ్య ఆసియా. కథా కథనంలో చారిత్రక సత్యాలను ఎంతవరకు స్వీకరించాననే విషయాన్ని 'చివరి మాట'లో వివరించాను. నైనిటాల్, రాహుల్ సాంకృత్యాయన్ 22-3-1950.