MADHURAKAVI NALAMU KRISHNARAO by NALAMU KRISHNARAO Telugu book cover

MADHURAKAVI NALAMU KRISHNARAO

by NALAMU KRISHNARAO

₹200
In stock · 20 available
PublisherVENNISETTY SINGARAO
LanguageTelugu
తాతగారితో నా అనుబంధం శ్రీమతి పోలేపల్లి సుహాసిని ఏలూరు. అనంతరత్న ప్రభవ భారతమాత. ఆమె ముద్దు బిడ్డల్లో ఆంధ్రమాతకు ఒక ముఖ్య స్థానమే ఉన్నది. ప్రతిభా వంతులైన కళాకారులను, సాంఘిక సేవకులను, శాస్త్రవేత్తలను, కార్యదక్షులను తన తల్లికి అందించడంలో ఆంధ్రమాత అగ్రేసరురాలు. ఇదే ఆంధ్రమాతకు ఎంతో విశిష్టతను, ప్రత్యేకతను, చేకూర్చింది. అట్టి ఆంధ్రమాత ముద్దుబిడ్డలలో రాణ్ణగర వాసియైన స్వర్గీయ నాళము కృష్ణారావు గారొకరు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో అంతర్జాతీయ నౌకావ్యాపార దక్షుడు, కలకత్తానుండి మద్రాసు వరకు అనేక సత్రాలను నిర్మించి ప్రజాసేవ చేసిన కార్యదక్షుడు, అనేక సంస్కృతాంధ్ర కావ్యాలను ముద్రించిన మహా కావ్య మనీషి, బహు వితరణశీలి, ఉదారగుణ చరిత్ర సంస్కారముకల దొడ్డమనిసి, దుర్మార్గు లకు పక్కలో బల్లెము, ఆశ్రిత బహు పండితానీకుడు అయిన నాళము కామరాజు, లక్ష్మమ్మల గర్భ శుక్తి ముక్తాఫలంగా నాళము కృష్ణారావుగారు వారి కడపటి సంతానంగా 1881వ సంవత్సరంలో మండపేటలో జన్మించారు. తండ్రిగారాయనకు వెంకట కృష్ణయ్య అని నామకరణం చేయగా, కాలాంతరంలో తన పేరును కృష్ణారావుగా మార్చుకొనిన ధీశాలి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అలాగే శ్రీకృష్ణారావు గారు కూడా బాల్యం నుండి భావ స్వాతంత్ర్యం, ఆచరణ వైశిష్ట్యం కలిగిన వింత మానిసి. కుహనా సంస్కారాలన్నా, మూఢాచారాలన్నా అనిష్టం చూపేవారు. అంతేకాక బాల్యంనుండి సంఘశ్రేయస్సుకు భంగం కల్గించే మూఢ విశ్వాసాలపై, కుటిల సంస్కారాలపై ధ్వజమెత్తి తిరుగుబాటు చేసిన విప్లవ వీరుడు. పేదవారికి సాయం చేయడంలో ఎంత చొరవ చూపేవారో, సాంఘిక దురాచారాలపై అంత విద్వేషాన్ని కనబరచే వారు. కష్టాలలో ఉన్నవారిని ఎంతో ఆర్తితో ఆదుకోవడంలో అమితాసక్తిని కన్పరచేవారు. తనకు తండ్రిగారు, ఇతర బంధు వర్గం ప్రేమతో ఇచ్చిన డబ్బును ఆర్తులకు అందించి వారిని ఆదుకొని పునర్జీవితాన్నిచ్చిన ఆర్తత్రాణ పరాయణుడు. తోటి మిత్ర బృందంతో కలిసి అనేక సత్కార్యాలను చేసిన మహనీయుడు. కృష్ణారావుగారికి బాల్యంలోనే మాతృవియోగం కలుగగా సంతాన విహీన అయిన చిన్న వదిన అమ్మణిగారాయనను పుత్రప్రేమతో దగ్గరకు తీసి పెంచారు. బాల్యంలో కృష్ణారావుగారు చదువుపై అంతశ్రద్ధ చూపేవారు కాదట, సాములు చేసి, పరోపకార జీవితానికి ఓంకారాన్ని దిద్దారట. ఈ విధంగా సాంఘిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమై చదువుమీద శ్రద్ధ చూపక పోవడం వల్ల తండ్రిగారు కృష్ణారావుగారిని కాకినాడలో ఉన్న తన మూడవ కుమారుడు నాళము పద్మనాభంగారి దగ్గరకు పంపారట. అక్కడకూడా కృష్ణారావుగారు చదువు మీద శ్రద్ధ చూపక తన సేవా కార్యక్రమాలను కొనసాగించడమే కాక, బ్రహ్మ సమాజ సిద్ధాంతంపట్ల ఆకర్షితుడై ఆ కార్యక్రమాలలో చురుకుగా పాలు పంచుకునే వారట. పద్మనాభంగారు తమ్ముని చదువు గురించి విచారించి ఆయన గురువులను కలియగా, వారు కృష్ణారావుగారి గురించి ఎంతగానో కొనియాడారట. తొమ్మిదవ తరగతి పరీక్షా పత్రాలలో పద్యాలతో సమాధానాలు వ్రాశారని గురువులు పద్మనాభంగారికి చూపగా, ఆయన సంతోషించి తండ్రిగారికి విషయం తెలియ చేశారట. కుమారుని ప్రజ్ఞాపాటవాలకు కామరాజుగారు ఎంతో మురిసి కొడుకును తిరిగి రాజమండ్రికి పిలిపించుకున్నారట. మహిళాజన సంఘోద్ధరణకూడ కృష్ణారావుగారి దినచర్యలో ఓ భాగమే. మహిళలకు అనేక విధాలుగా తన సేవలందించేవారు. తాతగారి జీవితంలో ప్రతినిత్యము స్మరించుకోదగిన మఖ్యాంశం సేవాసదన స్థాపన. ఆయన పెదతండ్రి కుమారులైన నాళము రామలింగయ్య గారితో కలసి వైశ్య బాలికలకు