
MADINAARU - LR.SWAMY
by L.R.SWAMY
₹120
In stock · 106 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Madinaaru Translated by: L.R. Swamy 25.2.2. (WRITERS CO-OPERATIVE SOCIETY) ໑໓ ລໍ ລ້ ప్రచురణ సంస్థ ప్రచురించిన 'జారుకళ్' అనే మలయాళ దళిత కథా సంకలనానికి అనువాదం ఈ పుస్తకం. ఈ సంకలనంలో 23 కథలున్నాయి. కథకులందరూ దళితులే. నేటి మలయాళ సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ముఖ్యధార. మనిషికి ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడి జీవిత సమస్యలతోపాటు ప్రాంతాలకు మాత్రం పరిమితమైన కొన్ని సమస్యలు కూడా వుంటాయి. ఒక ప్రాంతం తాలూకు అంటే ఒక ప్రాంతీయ భాషలో వెలువడిన సాహిత్యం చదివినప్పుడు అవి మనకు అవగతమవుతాయి. కేరళ రాష్ట్రానికి చెందిన దళితుల సమస్యలు తెలుసుకోవడానికే కాక తులనాత్మక అధ్యయనం కోసం కూడా పనికివస్తాయి ఈ కథలు. తొలి తరం దళిత రచయిత కథ మొదలుకొని నేటి దళిత రచయిత రాసిన కథ వరకు ఈ సంకలనంలో చోటుచేసుకుంది. మలయాళ దళిత కథల తొలి తెలుగు అనువాద సంకలనం ఇదేనని చెప్పవచ్చు. మలయాళం నుంచి నేరుగా తెలుగులోకి అనువాదం చేయబడిన సంపుటి ఇది. అనువాదకుడు మలయాళీ అయినా ఉద్యోగరీత్యా విశాఖ వచ్చి స్థిరపడిన తరువాత తెలుగు భాష, సాహిత్యం స్వయంగా నేర్చుకుని తెలుగులో 250 కథలు రాసి ప్రసిద్ధికెక్కిన కథారచయిత, అనువాదకుడు. ఆరు కథా సంపుటాలు వెలువరించారు. వివిధ వార, మాస పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు పొందారు. మలయాళం నుంచి తెలుగులోకి 24 పుస్తకాలు, తెలుగు నుంచి మలయాళంలోకి 16 పుస్తకాలు అనువాదం చేశారు. మలయాళం నుంచి తెలుగులోకి అనువాదం చేసినందుకుగాను 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.