
MAHA MANISHI DR.SARVEPALLI RADHAKRISHNAN SANKSHIPTA JEEVITHA PARICHAYAM
₹50
In stock · 312 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మహామనీషి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాల్యం, విద్యాభ్యాసం: 18వ శతాబ్ది మధ్య కాలంలో నెల్లూరుజిల్లా సర్వేపల్లి నుండి ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబం తిరుత్తని పట్టణానికి తరలి వెళ్ళింది. 1959 వరకూ ఈ పట్టణం ఆంధ్రలోని చిత్తూరుజిల్లాలో భాగంగా వుండి తరవాత తమిళనాడులో చేర్చబడింది. ఈ కుటుంబం తమ పూర్వీకుల స్థావరమైన సర్వేపల్లిని మరిచిపోకుండా తమ యింటి పేరుగా నిలుపుకున్నారు. తిరుత్తనిలో స్థానిక జమీందారు దగ్గిర వీరాస్వామి చిన్న రెవెన్యూ ఉద్యోగి. ఆయన భార్య సీతమ్మ. ఈ దంపతులకు అయిదుగురు కుమారులు ఒక కుమార్తె. 1888 సెప్టెంబర్ 5న వీరికి కలిగిన రెండవ కుమారుడే మన కథానాయకుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. నాలుగేండ్ల వయస్సున రాధాకృష్ణను తిరుత్తని బోర్డు హైస్కూలులో చేర్చారు. అక్కడ నాలుగు సంవత్సరాలు చదివి, ఇంగ్లీషు తెలుగు, లెక్కలు, చరిత్ర, భూగోళంలలో పరిచయం సంపాదించాడు రాధాకృష్ణన్. 1896లో రాధాకృష్ణన్ను తిరుపతిలోని హెర్మాన్సుబర్లు ఎసలాజికల్ లూథరన్. మిషను హైస్కూలులో చేర్చారు. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం అయ్యేవరకు దీనిని జర్మన్ మిషనరీలు నిర్వహించేవారు. ఇక్కడే రాధాకృష్ణన్ మొదటిసారిగా బైబిల్ చదివాడు. హిందూ ఆచారాలను పాటిస్తూ దేవాలయాలకు వెళ్ళేవాడు బాల రాధాకృష్ణన్. తొలిదశలో రాధాకృష్ణన్ చదువును గూర్చి చెప్పుకోవాల్సిన విశేషాలు లేవు. చురుకుగా వుంటూ ఉపకార వేతనాలు పొందుతూ వుండేవాడు. కానీ ఎక్కువగా చదివినట్లు కనపడేవాడుకాదు. ఆటల జోలికి అసలు పోయేవాడు కాదు. ఆయన ఆటవిడుపు ఏమంటే దూరంగా వున్న ఊళ్ళ వెంట తిరగడం, స్కాలర్షిప్పు డబ్బూ ఇంటినుండి వచ్చే డబ్బుల్లో ఏ కొంచెం మిగిలినా పర్యటనకు బయలుదేరేవాడు. ఇలా తిరిగే సందర్భాలలో ఒకసారి ఒక దొంగ, బాలుణ్ణి బాటనుండి తప్పించి ఒక బావి దగ్గరకు తీసికొని వెళ్ళాడు. బ్రాహ్మణ బాలుడు కదా ఏమైనా బంగారందొరకక పోతుందా అని ఒళ్ళంతా వెదికాడు. ఏదో తిండి గింజలు దాచిన చిన్ని సంచి తప్ప ఏమీ కనబడలేదు. బావిలో పడవేయకుండా బాలుణ్ణి అంతటితో వదిలివేశాడు.