MAHA SWAPNIKUDU by VENKAT KODURI Telugu book cover

MAHA SWAPNIKUDU

by VENKAT KODURI

₹250
In stock · 2 available
PublisherVENKAT KODURI
LanguageTelugu
మహా స్వాప్నికుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం నిత్య చైతన్యంతో స్వచ్ఛంగా సాగే గంగా ప్రవాహం వంటిది. ఉన్నత లక్ష్యాలే ఆయన స్వప్నాలు. వాటిని ఆచరణలో పెట్టడానికి ఒక్కక్షణం కూడా విశ్రమించకుండా నిరంతరం శ్రమిస్తున్న మహా స్వాప్నికుడు ఆయన. పేదరికం లేని విజ్ఞానవంతమైన సమాజాన్ని స్థాపించి, తెలుగువారిని అన్ని రంగాలలో అగ్రగాములుగా నిలపడమే ధ్యేయంగా తనకు వచ్చిన అవకాశాలను అద్భుతంగా వినియోగించుకొంటున్న విశిష్టనాయకుడు చంద్రబాబు నాయుడు. తెలుగువారి అస్థిత్వాన్ని ప్రపంచవ్యాపితం చేసిన మహా నాయకుల్లో చంద్రబాబునాయుడు ముందువరుసలో ఉంటారు. "అభివృద్ధి నా కర్తవ్యం, సంక్షేమం నా మార్గం, సుపరిపాలన నా ధ్యేయం, పనితనమే నా సందేశం 'విజన్'తో ముందుకు సాగడమే నా లక్ష్యం.. వీటి సాధన కోసం నిరంతరం శ్రమిస్తాను" అంటూ ఇప్పటికీ ఎన్నో అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో, ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పిస్తోన్న చంద్రబాబు నాయుడు గారి స్పూర్తిదాయక జీవితంలోని కొన్ని కీలక సంఘటనలకు సీనియర్ పాత్రికేయుడు విక్రమూల ఇచ్చిన అక్షర రూపమే 'మహా స్వాప్నికుడు'. ప్రచురణ : వెంకట్ కోడూరి