MAHAKAVI GURAJADA (ADHUNIKA TELUGUBHASHA SAHITYALAKU CHESINA SEVA) by ACHARYA S.GANGAPPA book cover

MAHAKAVI GURAJADA (ADHUNIKA TELUGUBHASHA SAHITYALAKU CHESINA SEVA)

by ACHARYA S.GANGAPPA

₹50
In stock · 93 available
PublisherSASI PRACHURANALU
LanguageTelugu
గురజాడ జీవిత విశేషాలు 1861 సెప్టెంబరు 21న విశాఖ జిల్లా ఎలమంచిలి తాలూకు రాయవరం గ్రామంలో పుట్టాడు గురజాడ. పుట్టింది విశాఖ జిల్లాలో అయినా జీవితంలో ఎక్కువ భాగం విజయనగరంలో సాగింది. ప్రాథమిక విద్య చీపురపల్లి గ్రాంట్ స్కూలులోను, విజయనగరం మిడిల్ స్కూలులోనూ సాగింది. 1882 మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. మెట్రిక్యులేషన్ లో ఆయన సహాధ్యాయి గిడుగు రామ్మూర్తి పంతులు. ఆ తరువాత ఎఫ్.ఏ. డిగ్రి చదివాడు. చదువు పూర్తయిన తరువాత కాలేజిలో కొన్నాళ్లు అధ్యాపకునిగా, డిప్యూటీ కలెక్టరాఫీసులో ప్రధాన గుమస్తాగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆనంద గజపతి సంస్థానంలో పరిశోధకుడిగా, రీవారాణి అంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. మద్రాసు యూనివర్సిటీ ఫెలోగా నియమితుడయ్యాడు. మెట్రిక్యులేషన్ చదువుతుండగానే ఆంగ్లంలో కవితలు, వ్యాసాలు రాయనారంభించాడు. మొదట సాంప్రదాయిక రీతిలో పద్యాలు రాసేవాడు. గిడుగుతో పరిచయం అయ్యాక ఆయనతో కలసి వ్యావహారిక భాషోద్యమం నడిపాడు. 1914లో వచన భాషా వివాదాన్ని పరిష్కరినిచేందుకు మద్రాసు విశ్వవిద్యాలయం ఒక సబ్ కమిటీని వేసింది. ఆ కమిటీలో వేదం వెంకటరాయ శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణ రావు, జయంతి రామయ్య పంతులు, ప్రొఫెసర్ రంగాచార్యులు, జి. వెంకట రంగారావు గురజాడ అప్పారావు సభ్యులు. వ్యావహారిక భాషలో రచన వుండాలని గట్టిగా వాదించింది గురజాడ ఒక్కరే. మిగతా వారంతా గ్రాంథిక భాషను సమర్థించారు. గురజాడ వాదం వీగిపోయింది. ఈ తీర్మానాన్ని తాను ఆమోదించలేనని గురజాడ 172 పేజీల అసమ్మతి పత్రాన్నొకదానిని కమిటీకి సమర్పించాడు. సాహిత్యవిమర్శ నావ్యాపకం. మధ్యలో ఎపిగ్రాఫిక్స్ శాసనాలు. చరిత్రల పరిశోధనా వ్యాపకాలు ఏకకాలంలో నిర్వహించి తన బహుముఖ ప్రజ్ఞను చాటాడు. కళాకారుడిగా, సాహితీ స్రష్టగా, సంఘ సంస్కర్తగా, వైతాళికునిగా నిలిచాడు. చివిరికి 1915 నవంబరు 30న కన్నుమూశారు.