MAHAMMAD PRAVAKTHA JEEVITHAM by P.SATYAVATHI Telugu book cover

MAHAMMAD PRAVAKTHA JEEVITHAM

by P.SATYAVATHI

₹150
In stock · 2 available
PublisherHYDERABAD BOOK TRUST
LanguageTelugu
ముహమ్మద్ ప్రవక్త జీవితం సల్మాన్ రద్దీ రచించిన "సెటానిక్ వెర్సెస్" వివాదం, ఫత్వా సందర్భంగా, పది సంవత్సరాల క్రితం నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను. అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారుకూడా అప్పుడు ఇస్లాం మతంపట్ల కనపరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవర పరిచింది. ఇరవైయ్యో శతాబ్దంలో జరిగిన దారుణమైన సంఘటనల తరువాత కూడా, ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా వున్న ఒక మతంపట్ల మనం అస్ఫుటమైన అసత్యమైన అభిప్రాయాలను పెంచిపోషించ కూడదనిపించింది. సల్మాన్ రద్దీ పై అయెతుల్లా ఖొమైనీ ఫత్వా విధించినప్పుడు ఈ అహేతుక ద్వేషం అనేక పశ్చిమ దేశాలలో మరింత ప్రత్యక్షంగా కనపడింది. 1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న 45 రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఈ ఫత్వాని ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్లో ఎవరూకూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సౌదీ అరేబియా షేకులు, కైరోలోని అల్ అజార్ మదర్సా కూడా ఈ ఫత్వా ఇస్లామ్ మత వ్యతిరేకమైనదన్నది. కానీ ఇదంతా పశ్చిమ దేశాలవారు విన దలచుకోలేదు. అయెతుల్లాతో విభేదించేవారూ, రష్టీని చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్లో చాలామంది వున్నారు. అయితే సల్మాన్ రద్దీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వీరిని తీవ్రంగా కలత పెట్టింది. పశ్చిమ మేధావులు మాత్రం, ముస్లింలంతా రద్దీ రక్తం కళ్ళ జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటిష్ రచయితలు, మేధావులు, తత్వవేత్తలు కూడా ఇస్లామ్ని సరిగ్గా అర్ధంచేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనపరిచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనంలేని ఒక మూఢమతం. గౌరవించతగ్గది కాదు. అంతేకాదు, రద్దీ ముహమ్మద్ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్లిముల సున్నితమైన మనోభావాలను వారు పట్టించుకోలేదు. అదంత ముఖ్యమైన విషయం కాదను కున్నారు.