MAHASWETHA - 90 by SUDHAMURTHY Telugu book cover

MAHASWETHA - 90

by SUDHAMURTHY

₹90
In stock · 3 available
PublisherALAKANANDA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట . నా రచన 'మహాశ్వేత' తెలుగులో ప్రచురణ అవుతున్నదని తెలిసి ఎంతో సంతోషం కలిగింది. 'స్కూలు విద్యార్థుల కోసం కంప్యూటర్ పుస్తకం' తో మొదలైన తెలుగు అనువాదాలు, ఇప్పటికి 'శ్రీమతి', 'మహాశ్వేత', 'డాలర్ కోడలు', 'అన్వేషణ', 'ఋణం', 'జ్ఞానం - పరిజ్ఞానం', 'అమ్మమ్మ చదువు', 'భరతభూమి- సమస్తుభ్యం' తెలుగు పాఠకులకు అందాయి. మీ అందరితో ఒక విషయాన్ని పంచుకుందామనుకుంటున్నాను. ఈ నవల నేను తొలిగా కన్నడంలో ఎంతోకాలం క్రిందటే వ్రాశాను. అయితే ఈ మధ్యనే ఇది ఇంగ్లీషు, తమిళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా భాషలతో పాటు, ఇప్పుడు తెలుగులోకి అనువదింపబడినది. 'స్వాతి' మాస పత్రికతో అనుబంధంగా (సంక్షిప్త నవల) 'మహాశ్వేత' తెలుగు పాఠకులకు తొలిగా పరిచయమయి, వారికి ఈ రచన పై ఆసక్తిని కలిగింప చేసింది. ఇప్పుడు ఈ నవల ద్వారా పూర్తి కథను పాఠకులు చదవవచ్చు. ఎక్కువమంది చదువుతున్నారని కాదు నేను ఈ నవల వ్రాయటంలోని ఉద్దేశ్యం. ఈ నవల ఎంతో మంది జీవితాలను ఒక మలుపు తిప్పింది. అలాంటి ఒక సంఘటననే నవల చివరిలో 'చిరస్మరణీయ వివాహం' అని వ్రాశాను. ఈ వ్యాధితో కృంగిపోయే వారికి ప్రేరణ ఇచ్చేందుకు ఎంతో మంది చర్మవ్యాధినిపుణులు ఈ పుస్తకాన్ని చదవమని తమను సంప్రదించే రోగులకు సలహాలిస్తున్నా. ఈ పుస్తకాన్ని ప్రచురించుటకు ఎంతో ఉత్సాహం చూపిన శ్రీ అశోక్ కుమార్ గారికి, తెలుగులోకి ఎంతో చక్కగా మూలం చెడకుండా అనువదించిన శ్రీమతి జగదీశ్వరి గారికి, ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని కొన్న మీ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయం అంతా దాన ధర్మాలకే ఉపయోగింపబడుతుంది.