MAHATMUDU by DR.DASARADHI RANGACHARYA Telugu book cover

MAHATMUDU

by DR.DASARADHI RANGACHARYA

₹25
In stock · 28 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మనవి మహాత్ముడు. ఆ పేరు వినగానే ఒక జ్యోతిర్మూర్తి మన ముందు ప్రత్యక్షం అవుతుంది. మస్తకం అవగతం అవుతుంది. గుండెలో గౌరవం- భక్తి భావం పొర్లుతాయి. ఆయన రామునిలాంటి వీరుడు కాడు. కృష్ణునిలాంటి యుగపురుషుడు కాడు. బుద్ధునిలాంటి యోగి కాడు. క్రీస్తులాంటి ప్రవక్తకాడు. ఆయన సామాన్య భారతీయుని కంటె తక్కువ జీవితం గడిపాడు. సామాన్యునిలా తప్పులూ, ఒప్పులూ చేశాడు. అయినా ఆయన ముందు మోకరిల్లుతాం. ఎందుకు? ఆయన 40 కోట్లమంది భారతీయుల్ని తన కనుసన్నల్లో నడిపించారు. కాంగ్రెసులో ఆయన అభిప్రాయాలతోనూ, మతంతోనూ ఏకీభవించే వారికంటే వ్యతిరేకించేవారే ఎక్కువమంది వుండే వారు. అయినా ఆయనమాట జవదాటలేకపోయేవారు. ఒక్కోసారి ఆయన ప్రతిపాదనలకు తీవ్ర వ్యతిరేకత వుండేది. కాని తీరా ఓటింగు దగ్గరికి వస్తే ఆయనే నెగ్గేవాడు. అది ఆయనలోని మహత్తర శక్తి. అది అనితర సాధ్యం. మహాత్ముడు ఆయన ముమ్మూర్తులా మహాత్ముడే. సూర్యుడు అస్తమించని బ్రిటిషు సామ్రాజ్య సింహాన్ని వట్టి ఖద్దరు పోగుతో కట్టివేయగలిగాడు. అది ఎవరికి సాధ్యం? శత్రువును సహితం మిత్రునిలా ప్రేమించగలగడం ఎవరికి సాధ్యం? ఒక్క మహాత్మునికే. “నా జీవితం మొత్తం అల్ప సంఖ్యాకుల కోసరమే. దుఃఖితుల కోసరమే అంకితం చేశా" నన్నారు. చిచ్చును లెక్కచేయకుండా ఉరికారు. తుదకు దుఃఖితుల కోసరమే బలి అయినారు.