MAHATMUNI SATYAGRAHALU by KODURI SRIRAMA MURTHY Telugu book cover

MAHATMUNI SATYAGRAHALU

by KODURI SRIRAMA MURTHY

₹80
In stock · 38 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. సత్యాగ్రహం - కథా, కమామీషూ మహాత్ముడు చేసిన శాంతియుత పోరాటాలలో శక్తివంతమైన ఆయుధం సత్యాగ్రహం'. సత్యాగ్రహ విధానమే లేకుంటే ఆయన నైతిక పోరాటమే లేదు. సత్యాగ్రహాలను విజయవంతంగా నిర్వహించడంలో మహాత్మునికి గల దక్షత ఆయనకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఎనలేని రీతిలో సముపార్జించి పెట్టింది. గాంధేయ విధానాలలోని సారాంశమంతా 'సత్యాగ్రహం' అనే పదంలో ఇమిడి వుందని చెప్పడంలో ఱిశయోక్తి లేదు. జర్మనీకి అధ్యక్షుడుగా ఎన్నిక అయిన 'జాకిమ్ గాక్' (Jachim Gauck) ఆ దేశపు సభను ఉద్దేశించి మాట్లాడుతూ "మహాత్మునివలె మనం ఆత్మస్థయిర్యాన్ని, నన్నయత్వాన్ని, పెంపొందించుకుంటే విజయాన్ని సునాయాసంగా సాధించగలం" అని ఇటీవల అనడాన్ని గమనిస్తే - ఆయన సిద్ధాంతాలకు గల విశ్వజనీనతను, సర్వకాలీనతను అనగతం చేసుకోగలం. ''సత్యాగ్రహము' అనేపదం 'సత్యము', 'ఆగ్రహము' అనే రెండు పదాల సమన్వయం. ఈ రెండు మాటలకూ జనసామాన్యంలో అవగాహనలో వున్న అర్థానికీ చాలా తేడా వుంది. "నేను సత్యమునకు గాక, మరెవరికీ విధేయుడను కాను. సత్యంగాక నేను సేవించవలసిన దేముడు కూడా ఎవరూ లేరు" అని ప్రకటించుకున్న గాంధీజీ దృష్టిలో "సత్యము" అనే మాటకు గల విశిష్టార్థాన్ని ఈ క్రిందివిధంగా వివరించవచ్చును. గాంధీజీ దృష్టిలో 'సత్యము' అనే భావన సరిపోల్చి చెప్పేదికాదు. (Not Relative). ລ້ 5 ລ້ ລ້ (Absolute Truth) సర్వసాధారణంగా అబద్ధం ఆడకుండా వుండడాన్ని సత్యమును పాటించడం అంటాం. ఒకప్పుడు గాంధీగారు 'సత్యహరిశ్చంద్ర' నాటకం చూచి అసత్యం ఆడకుండా వుండడమే 'సత్యమును పాటించడం' కోరి శ్రీరామమూర్తి మహాత్ముని సత్యాగ్రహాలు