MALAPALLE KATHALU by BHUTHAM MUTHYALU Telugu book cover

MALAPALLE KATHALU

by BHUTHAM MUTHYALU

₹100
In stock · 8 available
PublisherBHUTHAM MUTHYALU
LanguageTelugu
భూతం ముత్యాలు మాలపల్లె “ఇదిగో సావుకారి బాగున్నవా, ఏంది ఇట్టావచ్చినవ్. ఊకెనేరారు మహనుబావులు ఏందికథా. అచ్చా ఇంతకూ నీ యాపారం ఎట్టా నడుస్తుంది.” అంటూ చూడనట్టుగా సరసర నడుస్తూ వెడుతున్న అతన్ని ఓరగా చూస్తూ, చుట్టదమ్ము గుంజుతూ పలకరించాడు దొరవారు. "అయ్యా దొరవారు నేను మిమ్ముల చూసుకోలేదండి, అయ్యా ఊరి కామందులు ఇప్పటికి మీ దయవలన నా యాపారం మూడుపూవులు ఆరుకాయలు గ నడుస్తుంది. మీ చూపుండగ నాకేంది. మీ అండదండలు వుండాలేగని తిమ్మిని బమ్మిని చేయను." సావదానంగా బదులు పలికాడు సావుకారి దొరవైపు వినయం నటిస్తూ..com "నాదేముందయ్యా వంటకల్లంనాడు దాన్యంరాశులు కొలిచే కుండమీదేనాయె, కుండమీది సేరు మాపాలేనాయె. అట రాసిపెట్టుకొని వస్తారి.” అంటూ ముసిగా నవ్వుతూ ముందుకు కదిలిండుదొర. అతన్ని అనుకరిస్తూ సావుకారి నడుస్తుండు. వారివెనకాల బక్క మల్లడు నడుస్తుండు. "దొరగారు ఈ లేక ముండాకొడ్కులు ఉన్నరు చూసిండ్రా అయిటి సురువైందంటే పెట్టుబడులకు మనమే ఇయ్యాలే. ఇగ పంట పండినాక ఇయ్యనికె కాళ్ల బేరానికొస్తరు ఎదవసంత " అని రుసరుసలాడుతూ గులగ సాగాడు అలా అంటూనే. "నాకంటే మీరే నయం దొర, ఎంతైనా ఊరికి దొరలు ఎవడైనా మీకనుసన్నల్లో నడవాల్సిందే మీకు ఎదురు మాట్లాడే తగువ ఎవనికుందండి కాని" అని వంగాడుతూ నీళ్లు మింగ సాగాడు "కాని ఏందయ్య... చెప్పు ఎంది కథ" అని అతను అడగగానే "అయ్యా సర్పంచిగ ఇన్నొద్దులు మీది ఆడింది ఆట పాడింది పాట ఊరు మొత్తానికి పెద్ద కడప ఉన్నదిగా మాల గూడేం ఎవడు గెలవాలన్న గాళ్ల ఓటు కావాల్సిందే మరి ఈసారి తమరి సీటు పోతట్టుంది సర్కారు డప్పు సాటింపు ఏసింది" అని తాపిగా బదులిచ్చాడు సావుకారి.