MALLADI RAMAKRISHNA SASTRY NAVALALU by MALLADI RAMAKRISHNA Telugu book cover

MALLADI RAMAKRISHNA SASTRY NAVALALU

by MALLADI RAMAKRISHNA

₹190
In stock · 62 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
MALLADI RAMA KRISHNA SASTRY NOVELS మల్లాది రామకృష్ణ శాస్త్రి తెలుగు భాషకు అందాన్ని, తెలుగు కథకు యవ్వనాన్ని అందించిన ఘనత మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది. చాలా మంది కథలు రాస్తారు కానీ కొద్ది మందే కథలు చెప్తారు. కథకు చెప్పే గుణం ప్రాణం. అలా ప్రాణ ప్రతిష్ఠ చేసింది మల్లాది. వీరి కథనంలో కొంటెతనం, మాట విరుపులో వ్యంగ్యం పాఠకులను “అహో” అనిపిస్తాయి. సామాజిక సమస్యల బరువుతో రామకృష్ణ శాస్త్రిగారి కథలు కుంగీపోవు, ఉత్తుంగ తరంగ ఝరీ వేగ శైలితో పొంగీపోవు. మనసున్న మనిషిగా, దార్శనికత ఉన్న రచయితగా, ఎన్ని కోణాలలో తనచుట్టూ ఉన్న సమాజాన్ని చూశాడో, దాని గుండె చప్పుళ్ళను వినిపించే కథన కంఠస్వరం మల్లాది వారిది. ప్రౌఢవాక్యాల మబ్బు తెరలను ఒత్తిగించి చీల్చగా, హాయిగా, మనసులను మురిపించి మైమరపించేవి శాస్త్రిగారి కథాశరచ్చంద్రికలు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలూ వీరి చేతిలో తెలుగుతనం నింపుకున్నాయి. మెదళ్ళను తట్టి లేపుతూ మనసుల్ని అందుకున్నాయి. వీరి అక్షరాలకు శ్వాసించే లక్షణం ఉంది. వీరి వాక్యాలకు పరిగెత్తే వాళ్ళను పట్టి, లాగి, ఆలోచించమనే సాహసం ఉంది. వీరి వచనానికి చురుక్కు మనిపించే తెలుగు "వాడి" తనముంది. జీవితమంత సహజత్వం ఉంది. అందుకే అంటారు వచన రచనకు మేస్త్రి రామకృష్ణశాస్త్రి పల్లం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004