
MALOKAM KATHALU - 80
by VEDULA CHINAVENKATA CHAYANULU
₹80
In stock · 777 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చలాకీ పిల్లి అనగనగా మాలోకంలో ఒక ఇంట్లో ఓ చలాకీ పిల్లి ఉండేది. అది ఎంత చలాకీ అంటే ఎలుక కనబడనవసరం లేదు. దాని మీసం కొస చూస్తే చాలు దాని జాడ పసిగట్టేసేది. కనబడిందంటే ఆ ఎలుక పని అయిందన్నమాటే. అందుకని ఆ ఇంట్లో ఎలుకలకి వాటి కన్నాలు వదిలి రావడమే ప్రాణసంకటమయి తిండికైనా బయటకు రావడం మానేశాయి. ఆ చలాకీ పిల్లికదేమీ నచ్చలేదు. ఎలుకలు బయటకు వచ్చి వాటి తిండి తిని లావెక్కాలి. అప్పుడు వాటిని పట్టి తింటేనే తన కడుపు నిండుతుంది. ఎలుకలు ఎలా బయటకు వచ్చి తిరిగేలా చేయాలా అని ఆలోచించి ఒక పన్నాగం పన్నింది. చచ్చిపోయినట్లు తలక్రిందులా దూలాన్నించి వేలాడుతూ కూర్చుంది. ఇదేంటి ఇలా కదలక మెదలక వేలాడుతోంది అని ఎలుకలు కన్నాలలోంచి చూసి ఆశ్చర్యపోయాయి. ఐనా వెంటనే బయటికి రాలేదవి. మరికొంచెం సేపయ్యాక చూసి ఇంకా అలాగే ఉంది అని చచ్చి పోయిందేమో అనుమానం ఆ ఎలుకలకి కలిగింది. అయినా జాగ్రత్తగానే కొంచెం బయటకు వచ్చి అలా అలా కన్నాల దగ్గరే తచ్చాడాయి. పిల్లిలో చలనం గిలనం లేదు. చాలారోజులయ్యాయి. మరికొంచెం సేపయ్యాక చచ్చిపోయి ఉంటే యజమాని పారేసే ముందు అలా వేలాడగట్టి బయటకు వెళ్లి ఉంటాడని ధైర్యం తెచ్చుకుని పిల్లి ముందునుంచి వెళ్లి దానిని ఓసారి ముట్టుకుని అప్పటికీ ఏమీ చలనం లేకపోతే పిల్లి సంగతి మరచిపోయాయి. హాయిగా దొరికిన మంచి మంచి పళ్లు, ఫలహారాలూ పొట్టనిండా తిని పిల్లి ముందే ఆ గదిలో ఆటలాడుకోవడం మొదలెట్టాయి. అప్పుడు పిల్లి లేచి ఓ మూడునాలుగు ఎలుకలని పట్టుకుని కడుపునిండా తినేసింది. మిగతా ఎలుకలు అమ్మోయ్, బాబోయ్ అంటూ మళ్లీ కన్నాలలోకి పారిపోయాయి. ఆ తరువాత అవి బయటకు వస్తే ఒట్టు. మళ్లీ పిల్లికి ఇంకో ఎత్తువేసి ఎలుకలని బయటకు రప్పిస్తేనేగానీ తనకు ఇష్టమైన ఎలుక మాంసం దొరికేటట్లు లేదు. అందుకని ఈసారి గదిలో వాటికి కనబడకుండా ఉండేలాగా గది మూలన కుప్పవేసిన ముగ్గులో దాక్కుంది. ఎలుకలు కన్నాలలోంచి చూసి రోజు రోజల్లా పిల్లి కనపడలేదే అని ఆశ్చర్యపోయాయి. కానీ ఒకసారి దాని ఆటలో దెబ్బతిన్నాయి కదా అని ఓ ముసలి ఎలుక “ఉండండర్రా! నే వెళ్లి పరీక్ష చేసి వస్తాను. ఒకవేళ