
MANA BHASHA MANA YAASA
₹450
In stock · 1 available
PublisherMADIPALLI BHADRAIAH
LanguageTelugu
"కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు" ఆ విధంగా 2007లో ప్రారంభించిన పదకోశం దరిదాపుగా 12 ఏండ్ల అనగా 2019 వరకు ఓ పుష్కరకాలానికి ఓ కొలిక్కి వచ్చింది. నేను అడపాదడపా, అప్పటికప్పుడు నాకక్కిరిబిక్కిరైన చిక్కురాతతో రాసిచ్చిన వందల సంఖ్యలో గల కాగితాల్ని ఏ మాత్రం విసుగూ విరామమన్నది ప్రదర్శించకుండా ఎంతో ఓపికతో అక్షరాకృతి 'నిచ్చి డి.టి.పి. చేసిన శ్రీమతి నిర్మలారెడ్డి గారి యొక్క కృషిని ఎంత కొనియాడినను తక్కువే. ఏవో ఒకటి రెండు చిన్న పుస్తకాలు తప్ప 1998 నుండి 2019 వరకు సుమారు 20 ఏండ్ల పైబడి నాచే వ్రాయబడిన రచనలను ఈమె గారు తన ఓర్పునేర్పులతో అందమైన అక్షరరూపాన్నిచ్చిన వీరికి ఏమిచ్చి ఆమె గారి ఋణం తీర్చుకోగలను. ఇక నాచే రూపుదిద్దుకున్న రచనలు ఎందరికి పచనమైనాయో తెల్పలేను కాని, వీటి ముద్రణ కొరకై ఇన్నేళ్ల నుండి ఓ నాలుగైదు పుస్తకాలకు మినహాయిస్తే ఓ పదిహేనింటి వరకు వదాన్యులైన మిత్రులు దాతలుగా నిల్చి నన్ను ప్రోత్సహించిన విధానాన్ని ఏ విధంగా మరువగలను. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు. ఇప్పుడీ ప్రస్తుత గ్రంథానికి అర్ధించిన తడవునే తమ అభిప్రాయపూర్వక ఆశీస్సులను, అభినందన పూర్వక సందేశములనందించిన గౌరవనీయులైన తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (దేవాదాయ ధర్మాదాయ-అటవీ మరియు న్యాయశాఖా మంత్రి సత్తములు) గారికి మాన్యులు ఆదిలాబాదు, జిల్లా పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు శ్రీ సోయంబాపూ రావు గారికి ఆదరణీయులైన ఆదిలాబాదు జిల్లా, కొమురమ్జీమ్ ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా మరియు నిర్మల్ జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా మెజిస్ట్రేట్లగారలకు అట్లే మాన్య జిల్లాల విద్యా శాఖ అధికారవర్యులకు నమన పూర్వక కృతజ్ఞతలు