MANA DESAM MANA RAJYANGAM by DR.KATTI PADMARAO Telugu book cover

MANA DESAM MANA RAJYANGAM

by DR.KATTI PADMARAO

₹600
In stock · 1 available
PublisherLOKAYATA PRACHURANALU
LanguageTelugu
MANA DESAM MANA RAJYANGAM Dr. Kathi Padmarao మన దేశం, మన రాజ్యాంగం అనే ఈ గ్రంథం డా॥ కత్తి పద్మారావు గారి కృషి, పట్టుదల, అధ్యయనం, పరిశోథన, దృక్పథం నుండి ఆవిర్భవించింది. డా॥ కత్తి పద్మారావు గారు న్యూఢిల్లీలో ఐ.సి.యస్.యస్. ఆర్. సీనియర్ ఫెలోగా పట్టాను పొందారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆయన ఇప్పటికి 90 గ్రంథాలు వ్రాసి ముద్రించారు. ఆయనకు 55 వేల పుస్తకాల స్వీయ గ్రంథాలయం వుంది. డా॥ కత్తి పద్మారావు గారు భారత రాజ్యాంగాన్ని దేశానికి సమన్వయిస్తూ సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్థల పునర్నిర్మాణానికి పూనుకున్నారు. డా॥ కత్తి పద్మారావు గారు మేధావి, ఆలోచనా పరుడు, సామాజిక విప్లవకారుడు, నిర్మాణ కర్త. భారతదేశ సామాజిక రాజకీయాల్లో నూతనమైన మలుపులు తిప్పిన ఉద్యమకారుడు. డా॥ కత్తి పద్మారావు గారు ఈ గ్రంథ రచనకోసం భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణం కోసం అధ్యయనం చేసిన క్రమాన్ని గూర్చి పరిశోధించారు. బుద్దుని అష్టాంగ సూత్రాలను పంచశీలను రాజ్యాంగానికి సమన్వయించిన అనేక విషయాలను మనముందుకు తెచ్చారు. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం వంటిగ్రంథం డా॥ కత్తి పద్మారావు గారు నడుస్తున్న గ్రంధాలయం వంటి వారు. ఈ దశాబ్దపు రాజ్యాంగ సూత్రాల సామాజిక రాజకీయ అన్వయానికి సంబంధించిన గ్రంథం ఇది. ప్రతి ఒక్కరికి పఠనీయ గ్రంథం. ఈ గ్రంధాన్ని కూడా మీరు పఠించి అనుసరించి సామాజిక రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకొంటారని అభిలషసిస్తూ, ఈ గ్రంథ పఠనం ద్వారా భారతరాజ్యాంగ స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాం. ఈ గ్రంథం మీకు దిక్సూచిగా వుండి నడిపిస్తుందని విశ్వసిస్తున్నాం.