MANA GNANENDRIYALU - 40.00 by E.KOMMALAYYA Telugu book cover

MANA GNANENDRIYALU - 40.00

by E.KOMMALAYYA

₹40
In stock · 878 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనే సూక్తి మీ అందరికీ తెల్సిందే! అనగా అన్ని అవయవాలలోకెల్ల కన్ను అతి ముఖ్య అవయవమని దీని భావం! ఈ కన్ను ఐదు జ్ఞానేంద్రియాలలో ఒకటి. మన జ్ఞానేంద్రియాలు 1. కన్ను, 2. ముక్కు, 3. చెవి, 4. నాలుక, 5. చర్మం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధులు సోకినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బతికినన్నాళ్ళూ సుఖంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలలో నాలుగింటిని భగవంతుడు ఒక్క తలలోనే అమర్చాడు. దీన్నే శిరః ప్రాధాన్యత అంటారు. ఒక్క చర్మాన్ని మాత్రం శరీరమంతా అమర్చాడు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలలో సున్నితమైన గ్రాహకాలు. (Receptors), ໖ (Nerves), ໖ (Blood Vesseles) అమరి ఉన్నాయి. కావున ఇవి చాలా సున్నితమైనవి, కాబట్టి వీనిని చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే ఈ జ్ఞానేంద్రియాలు అనే అంశాన్ని తీసుకుని నేను ముందు వాటి నిర్మాణం, తర్వాత వాటిని గూర్చిన విశేషాలు, వాటి సంరక్షణకు చేపట్టవలసిన చర్యలు, సాధారణంగా వాటికి సోకే వ్యాధులు - వాటి నివారణ ఔషధాల గూర్చి వివరించాను. ఈ పుస్తకం జ్ఞానేంద్రియాలపై సాధారణ స్థాయినుండి ప్రాథమిక స్థాయి వరకు సులభంగా అర్థమయ్యేవిధంగా వివరించడం జరిగింది. ఇది చదవడం వల్ల సాధారణ పరిజ్ఞానం పెరగడమే గాక, వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. ఆయా వ్యాధులకు మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఐతే చిన్నచిన్న రుగ్మతలకు ఇచ్చిన మోతాదు ప్రకారం వాడితే ఫర్వాలేదు కానీ, ఏవైనా పెద్ద రుగ్మతలు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలని, సొంత వైద్యం కూడదని, నా మనవి