MANA GRAMEENA KREEDALU by DR.B.DAMODARA RAO Telugu book cover

MANA GRAMEENA KREEDALU

by DR.B.DAMODARA RAO

₹30
In stock · 106 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ క్రీడాలోకంలోకి...... ఈ క్రీడాలోకంలోకి తొంగిచూస్తే, తలుపుతెరిస్తే, తెలిసే విషయం ఒకటే. దేశం వారైనా వారి వారి సృజనమేరకు వాళ్ళే స్వయంగా ఆటలు శృష్టించుకోగలుగుతారని, ప్రతి సంస్కృతికీ వారి ప్రత్యేక క్రీడలుంటాయని, ఆ క్రీడ పరిసరాలు, వస్తువులు వారికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటారని, చాలా కాలం క్రితమే మనవాళ్ళు శారీరక, మానసిక వికాసానికి మాత్రమే గాక, వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ క్రీడలు వివరిస్తాయి. తార్కిక బుద్ధికి ఎత్తుకు పై ఎత్తులు వేయటం 'పుంజీతం' నేర్పితే, ముందువాన్ని వెనక్కి తోసి రాజుకావటం ఎలానో వచ్చీసు' చూపెడుతుంది. ఇవి ఊరి ఆటలే కావొచ్చు, కాని ప్రతి ఆటలోను ఐక్యతకు పెద్ద పీట వేశారు. ఆటకైనా, బతుకు ఆటకైనా నిబంధనలుంటాయని తెలుపుతాయి. ఒకే ఆట రెండు మూడు పేర్లతో కనిపించాయి. సృజన వ్యక్తిగత ప్రతిభనుండి పుట్టి సమాజగతమవుతుందని ఈ క్రీడలు నిరూపిస్తాయి. ప్రతిగ్రామం తమ సొంత ఆటల్ని సృష్టించుకోవటం, నా జానపద విజ్ఞాన పరిశోధనలో గమనించాను. గ్రామాల్ని 'యూనిట్' గా తీసుకొని పరిశీలిస్తే, ఈ నిజం రుజువైంది. ఈ ఆటల్లోని ఆంతర్యం పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని వివరించేవే మా తరం వరకు ఈ ఆటలకు మేం వారసులం. భావితరం వీటిని కోల్పోతే నిజంగా దురదృష్టవంతులే. తెలంగాణ సంస్కృతి పరిశోధనలో నేను సేకరించుకున్న ఆటలన్నీ తిరగదోడాను. ఇప్పటికీ చాలా గ్రామాల్లో యివి నిలచి ఉన్నాయి. కారణం కొన్ని గ్రామాలు ఇంకా ఉనికి కోల్పోకపోవటమే. ప్రశాంతతకు భంగం వాటిల్లిన పల్లెలు మాత్రం ఈ సౌభాగ్యం పూర్తిగా కోల్పోయాయి. బాల్యం కొన్ని ఆటల్ని కాపాడుకుంది. నిరక్షరాస్యత మరికొన్ని భద్రపర్చుకుంది. పోయినవి పోగా, కొన్ని పరిశోధకులవల్ల, మరికొన్ని తెలుగు విశ్వవిద్యాలయ గిరిజన విజ్ఞానపీఠం, విజ్ఞానదర్శిని వేటలో భద్రపర్చటం వల్ల బతికిపోయాయి. కొన్ని వీస్తున్న నాగరిక పవనాలకు విస్తుపోయి పక్కకు తప్పుకున్నాయి. మరికొన్ని క్రికెట్టు దెబ్బకు జారుకున్నాయి. కబడ్డీ మోటయ్యింది. 'గోలీలు' మూలపడ్డాయి. 'దాగుడుమూతలు', దగాకోరుల ఆటగా ఎదిగింది. కోతికొమ్మచ్చి, ధరలు సొంతం చేసుకున్నాయి. రాజకీయాలు 'పుంజీత', మయ్యాయి. అధికార పులులకు బలహీన మేకలు బలి అవుతున్నాయి. ఏదిఏమైనా నాటి సజీవ సంస్కృతి ఏనాటికైనా తెలియాలి అంటే ముందు దాన్ని అక్షరబద్ధం చేయడం అవసరం. జానపద సంస్కృతి భద్రపర్చుకోవటంలో, గౌరవించటంలో తెలుగుజాతి వెనుకబడిఉంది. నేటికి విశాలాంధ్ర ప్రచురణాలయం, తెలుగు విశ్వవిద్యాలయ గిరిజన విజ్ఞానపీఠం కొంతలోకొంత కాపాడుతున్నందుకు సంతోషం. ఈ ఆటల చివర శిశుప్రాయంలోని పిల్లలను పాటలతో ఆడించే ఆటలను కూడా చేర్చాను. అందువల్ల గ్రామీణ క్రీడలన్నీ ప్రస్తావించినట్టు అవుతుందని భావించాను.