
MANA KEERTHI SIKHARALU - PRAMUKHA VYAKTHULA JEEVITHA CHARITRALU
₹40
In stock · 30 available
PublisherLAKSHMI GANAPATHI
LanguageTelugu
ముందుమాట నమస్కారం, బాలలు, జాతి, భాషా, కులమతాలకు అతీతంగా ఎందరో మహానుభావులు తమ జీవిత సర్వస్వాలను తృణప్రాయంగా భావించి భరతమాత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కొరకు తుదివరకు అలుపు ఎరుగని పోరాటం చేసి భరతమాత ఒడిలో ఒరిగిపోయారు. లాఠీ దెబ్బలు, చెరసాల శిక్షలు వందేమాతర గీతం ముందు తలలు వంచాయి. భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి శ్రమించిన మహనీయుల చరిత్ర మీకు తెలియజేసే ప్రయత్నంగా ఈ "మన కీర్తి శిఖరాలు" పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం. నిద్రావస్థలోని జాతిని మేలుకొలుపుతూ విజయ శంఖారావం పూరించిన తెలుగు స్వాతంత్య్ర సమర వీరుల త్యాగాన్ని, నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం వారి పోరాటంతో మనకు లభించాయని ఎన్నడూ ఎప్పుడు మరువ కూడదు. బాలలు ఔషధం తీసుకునే సమయంలో చేదుగా, బాధగా ఉంటుంది. కాని దాని ఫలితం దివ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. విద్య కూడా అంటే చదివే సమయంలో కష్టంగా ఉంటుంది. దాని ఫలితం బంగారు బాటవేసిన జీవితాన్ని ఇస్తుంది. ఈ మహనీయుల జీవిత చరిత్రలు చదివి ఉత్తమ ఆశయాలతో లక్ష్య దిశగా కదలండి. రేపటి తరానికి కరదీపికలై దేశ ప్రేమికులుగా, అవినీతి నిర్మూలన సమాజ నిర్దేశకులుగా ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలండి. "మన కీర్తి శిఖరాలు"గా ఎదిగి కన్నవారికి, ఉన్న ఊరికి, జన్మ భూమికి పేరు తీసుకురండి. ఈ రచనలు ప్రచురించిన 'బుజ్జాయి', 'బాలల చంద్రప్రభ', 'పున్నమి', 'బాలబాట' పత్రికల వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం అంకితం తీసుకోవడానికి అంగీకరించిన 'బుజ్జాయి' సంపాదకులు జి.ఏ.రావుగారికి, ముఖచిత్ర శిల్పి తుంలి శివాజి గారికి, ఆవిష్కరించిన డా॥రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం "చిలకలూరి పేటవారికి మరియు సూచనలు, సలహాలు ఇచ్చిన మిత్రులు డా||గంటిశెట్టి శివకుమార్, దార్ల బుజ్జిబాబు, బొందల నాగేశ్వరరావు గార్లకు ధన్యవాదాలు.