
MANA MAHATMUDU - 200
by M.V.R.SASTRY
₹200
In stock · 17 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
ఎందుకు రాశాను ? ఇంతకు ముందు నేను రాసిన చరిత్ర పుస్తకాలు ఒక ఎత్తు. ఈ 'మన మహాత్ముడు' ఇంకో ఎత్తు. దీనిలాగే అవీ నమ్మశక్యం కాని చేదు నిజాలను నిష్కర్షగా కుండబద్దలు కొట్టేవే. కాని శతాబ్దాల కిందటి వ్యక్తులకూ, ఘటనలకూ సంబంధించినట్టివి. సాధా రణంగా నేటి చదువరులకు వ్యక్తిగత పరిచయం గానీ లేనట్టివి. 'మహాత్ముడు' అలా కాదు. మహాత్మాగాంధీని చూసినవాళ్లు, మాట్లాడినవాళ్లు, సన్నిహితంగా ఎరిగిన వాళ్లు నేటికీ మన మధ్య ఉన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టు గాంధీ పేరు చెప్పి, స్వార్ధ రాజకీయ వ్యాపారం చేసుకుంటూ... అక్టోబర్2, జనవరి 30న మినహా (అదీ మొక్కుబడిగా తప్ప) గాంధీని తలవని ధూర్తులు మాత్రమే కాదు. త్రికరణ శుద్ధితో గాంధీని నమ్మి, ఆయన సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసంతో ఆయన చూపిన దారిలో నిజాయతీగా, నిస్వార్థంగా సాగుతున్న పుణ్యాత్ములూ, ఈ దేశంలో ఇంకా కొద్దిమందైనా ఉన్నారు. పుట్టినప్పటినుంచి గాంధీ గురించి గొప్పగా విని, పుస్తకాల్లో గొప్పగా చదివి, తమ కుటుంబాల్లో స్వాతంత్య్ర సమరయోధులైన పూర్వీకుల మూలంగా గాంధీ దివ్య స్మృతితో ఎమోషనల్ అనుబంధం పెంచుకుని ఆయనను అపరదైవంగా తలిచేవాళ్లు చాలా మందే ఉన్నారు. గాంధీ మహిమ గురించి తడవకో గొప్ప సంగతి వెలుగులోకి వస్తూనే ఉంటుంది. ఆయన విశిష్టతను ప్రపంచం ఇంకా ఎక్కువగా గుర్తించి, అరుదైన గౌరవం కనపరిచిన దృష్టాంతాలు చాలా తరచుగా వినపడుతూనే ఉంటాయి. పల్లె నుంచి ఢిల్లీ దాకా దేశంలో ఏ చోట చూసినా, ఏ మూలకు వెళ్లినా గాంధీ రోడ్లో, గాంధీ చౌకో, గాంధీ పార్కో గాంధీ బస్ స్టేషనో, గాంధీ ఇన్స్టిట్యూషనో ఏదో ఒకటి తారసపడుతుంది. ఆఖరికి ప్రతివాడి జేబులోనూ ప్రతి కరెన్సీ నోటులోనూ బోసినవ్వుల బాపూజీ దర్శనమిస్తాడు.