
MANA SAHITYAMLO KAVULU PUSTAKALU
₹1
In stock · 28 available
PublisherVELCHERU NARAYANA RAO
LanguageTelugu
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు రచన: వెల్చేరు నారాయణరావు ఈ వ్యాసాన్ని కొన్ని కథలతో మొదలు పెడతాను. మనం ఆదికావ్యం అనుకునే రామాయణాన్ని గురించి, ఆదికవి అనుకునే వాల్మీకిని గురించి చాలామందికి తెలిసిన కథ ఒకటుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణం అనే పేరుతో సంస్కృతంలో అచ్చయే రామాయణ పుస్తకాలు అన్నింటిలోను ఈ కథ వుంటుంది. ఈ రామాయణం రెండవసర్గలో వాల్మీకి తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు కూడా వెళ్తాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయం ప్రశాంత మనస్కుడైన వాల్మీకి హాయిగా ఉన్న రెండుపక్షులను చూస్తాడు. అవి క్రౌంచపక్షులు. ఒకటి ఆడ, ఇంకొకటి మగ. ఆ పక్షులు రెండూ హాయిగా మైథునానందంలో మైమరచి వున్నాయి. ఆ సమయంలో ఒక బోయవాడు (నిషాదుడు) ఆ రెండింటిలో మగపక్షిని చంపుతాడు. చచ్చిపోతున్న మగపక్షిని చూసి ఆడపక్షి ఏడుస్తూ వుంటుంది. ఆ విషాద దృశ్యాన్ని చూసి అప్రయత్నంగా వాల్మీకి నోటి నుంచి శాపరూపమైన ఈవాక్యం' వినిపిస్తుంది. మా నిషాద ప్రతిష్టామ్ త్వమగమశ్శాశ్వతీస్సమాః యత్రైంచమిథునాదేక మవధీః కామమోహితమ్ ఆ మాటలు తన నోటి నుంచి వచ్చిన వెంటనే వాల్మీకి తనకు తానే ఆశ్చర్యపోయి "కిమిదం వ్యాహృతం మయా" (ఏమిటి నేనన్నాను?) అని చూసుకుంటాడు. ఆ తరువాత ఒక మంచి సాహిత్యవిమర్శకుడి లాగా తన వాక్యాలను తానే చర్చిస్తాడు. అందులో నాలుగు సమానమైన పంక్తులున్నాయి. ప్రతి పంక్తిలోను ఉన్న అక్షరాలు సమానంగా వున్నాయి. తీగలున్న యంత్రం మీద ఇది పాడడానికి వీలుగా వుంది అని వివరించాక, ఇది శోకంలోంచి పుట్టింది కాబట్టి దీన్ని శ్లోకం అనడమే న్యాయం అని దీనికొక పేరు పెడతాడు.