MANAKU TELIYANI MAHATMUDU by KODURU SRIRAMA MURTHY Telugu book cover

MANAKU TELIYANI MAHATMUDU

by KODURU SRIRAMA MURTHY

₹80
In stock · 431 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1 గాంధీజీ మహాత్ముడిగా ఎలా ఎదిగాడు? మహాత్మునిగా గాంధీజీని ప్రపంచ ప్రజలందరూ గౌరవిస్తారు. ఒక వ్యక్తితో పైద్దాంతికంగా తీవ్రంగా విభేదించినవారు సైతం అతడిని మహోన్నతుడిగా వించడం గాంధీజీ విషయంలో సత్యం అయినట్టుగా చాలామంది విషయంలో ఆదోవనికాదు. ఐన్స్టీన్ అన్నట్లు "అతడి సమకాలీకులు కావడం మన అదృష్టం” దక్షిణాఫ్రికాలో తెల్లదొరల జాతి విచక్షణా విధానానికి వ్యతిరేకంగా సత్యాగ్రహోద్యమాలు నడిపేటప్పుడు ఆ దేశాధినేత జనరల్ స్మట్స్ గాంధీజీని పాలపాలు చేస్తే, ఆ చెరసాలలో కూర్చుని జనరల్ స్మట్స్కి చెప్పులుకుట్టి వాటిని బహూకరించినవాడు గాంధీజీ. ఆ తర్వాతికాలంలో జనరల్ స్మట్స్ ఆనాటి జ్ఞామాలను ఒక వ్యాసంగా రాస్తూ "గాంధీజీ కుట్టిన జోళ్లను వేసుకునే అర్హతలేనందున వాటిని అలా భద్రంగా వుంచాను" అని రాయడం చదివితే ప్రత్యర్థులకు సైతం చెడు మనసుతో ప్రేమించగల గాంధీజీ మహనీయత తెలుస్తుంది. మరికొన్ని దశాబ్దాల తర్వాత భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన అహింసా ఉద్యమంతో పునాదులతో సహా పెళ్లగించిన "అర్ధదిగంబర సన్యాసి" ఒకానొక సందర్భంలో ఇంగ్లాండ్ దేశపు భావిసామ్రాజ్ఞి (ఆనాటికి) ఎలిజిబెత్కు ప్రేమ పూర్వకంగా ఒక పంపాడంటే కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఎలిజిబెత్కు వివాహం జరిగినప్పుడు ధీజీ ఆమెకు ఒక కానుకను పంపించాడు. లేసు అల్లినగుడ్డ ఆ కానుక. ఆ వివాహానికి ఎందరెందరో దేశాధినేతలు వజ్రవైఢూర్యాలతో సహా అమూల్యమైన కానుకలు పంపారు. విలువతో పోలిస్తే గాంధీజీ పంపిన ఈ కానుక లెక్కలోనికి వారు కానీ, అది పంపినవారు మహాత్ముడు కాబట్టి ఎలిజిబెత్ దానిని అమూల్యంగా వావించుకుంది. "ఈ గుడ్డను టీపాయ్ మీద ఉపయోగించదలచలేదు. ఒక అతి విలువైన బహుమతిగా దీనిని భద్రపరచదలిచాను" అన్నదట ఆమె. ఈ విలువ వస్తువులోనిది కాదు. కానుక పంపిన వ్యక్తి వ్యక్తిత్వానికి చెందినది. "చెడును ద్వేషించు. చెడు చేసిన వారిని ద్వేషించవద్దు.” అనే మహాత్ముడిని వ్యక్తిగతంగా ద్వేషించినవారు, విమర్శించినవారు లేరనీ చెప్పాలి. మనకు తెలియని మహాత్ముడు కోడూరి శ్రీరామమూర్తి