MANASAVEENA MADHURAGEETHALU by RUDRANGI RAMESH Telugu book cover

MANASAVEENA MADHURAGEETHALU

by RUDRANGI RAMESH

₹50
In stock · 1 available
PublisherRUDRANGI RAMESH
LanguageTelugu
అభినందనలు ఈ గీత సంపుటిని పరిశీలిస్తే రుద్రంగ్ రమేశ్లోని గీత రచనా వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది. ఇందులో ఉన్న పాటలన్నీ లయాత్మకంగా సాగిపోయినవే. దైవభక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, తాత్త్విక గీతాలు, ప్రణయగీతాలు, ఇలా ఎనెన్ని రకాల పాటలో, ఈ సంపుటిలో చోటుచేసుకున్నాయి. సరదా సరదాగా పాడుకునే పాటలు ఒకవైపు జాలువారుతూ వుంటే, మరొక వైపు కవితాత్మను పొదుగుకున్న పాటలు కూడా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని పంక్తులు- "ఎర్రబడ్డ సూర్యున్ని అడుగు / రోజంతా తను పడ్డ సాధన ఎర్రబడ్డ ఇనుమునడుగు / కొలిమిలో తనుపడ్డ వేదన" మరొక గీతంలో రమేష్ అంటాడు ఇలా- "నీదేకులమంటే నవ్వింది నీరు / నీదేమతమంటే నవ్వింది గాలి॥ ఈ రెండు పంక్తులు చాలు రమేష్ ప్రగాఢ భావుకతను నిదర్శనంగా పేర్కొనడానికి. అక్కడక్కడ సాంద్రా తాత్వికతను గర్భీకరించుకున్న పంక్తులూ ఉన్నాయి. ఈ సంపుటిలో మచ్చుకు నాలుగు పంక్తులు- "మురిసే మల్లెపువ్వా / నీ బ్రతుకెంత కాలం, కురిసే మేఘధార / నీ గమ్యమెంత దూరము" కమనీయ గీత తుళుచ్ఛాన్ని అందిస్తున్న రుద్రంగ్ రమేష్కు నా హార్థికాభి సందనము.