
MANASU PUSTAKAM OOGISALADAKE MANASA
₹100
In stock · 72 available
PublisherBAHUDURAPU BATASARI
LanguageTelugu
ఊగిసలాడకె మనసా కొందరి పరిచయం మన ఆలోచన సరళిని మారుస్తుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూపెడుతుంది. ముఖపుస్తకంలో కవితలు మాత్రమే వ్రాసుకుంటున్న నాకు, రెండు సంవత్సరాల క్రితం ఓ మహిళ ఇన్బాక్స్ లోకొచ్చి భర్తని కోల్పోయిన తను, తరువాత తన జీవితంలో జరిగిన ప్రేమ కథని చెప్పి కవిత వ్రాయమని కోరింది. అవసరానికి మనసనే అందమైన పేరుపెట్టి తన జీవితంతో ఆడుకున్న ఆ వ్యధని కవిత్వంలో ఇమడ్చలేక ఓ కథకుడిగా మారాను. అలా నా ఈ మొదటి కథే ఈ “ఊగిసలాడకె మనసా.” బహుదూరపు బాటసారి ఈ యాంత్రిక జీవనంలో మనసుతో పాటు శరీరాన్ని తీసుకోపోయే మార్గామే లేక, నాలోవున్న మనసనే అంతర్ముఖుడుకి బహుదూరపు బాటసారి అనే కలం పేరు పెట్టి, నాతో మాట్లాడే ప్రతి మనసుని మనసుపుస్తకంలో ఓ పుటగా చేసి, ప్రేమ-మానవ సంబంధాలపై స్త్రీ-పురుషుల పాత్రని గత 5 సంవత్సరాల నుంచి అన్వేషిస్తూ కవితలు, కథలుగా వ్రాస్తున్నాను. ఇంతవరకు రెండువేలకు పైగా కవితలు, 5 మినీ నోవల్స్, 100 సినిమాలకు రివ్యూలు వ్రాసి ఉన్నాను.