MANAVA CHARITRA EKKADA PRARAMBHAMAINDI by DR.DEVARAJU MAHARAJU Telugu book cover

MANAVA CHARITRA EKKADA PRARAMBHAMAINDI

by DR.DEVARAJU MAHARAJU

₹100
In stock · 339 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126788
ప్రపంచంలో ఇప్పుడు మనిషి అనేవాడు ఎక్కడ ఉన్నా అతను హోమో సేపియనే! వేల వేల సంవత్సరాల క్రితం జాతి, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలు లేవు. తారతమ్యాలు లేవు. అంతా ఒకటే! అవన్నీ తరువాత కాలంలో మనుషులు కుత్సిత బుద్ధితో ఏర్పరుచుకున్నవి. ఒక అరవై వేల యేళ్ళ పాటు మానవ జాతులన్నీ కలిసి తిరిగాయి. కలిసి బతికాయి. ఫలితంగా జన్యు మార్పిడి జరిగింది. అదొక సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు ఉన్నవారంతా ఆ మహామానవ మిశ్రమ జాతిలోంచి పుట్టుకొచ్చినవారే. చరిత్ర అంటే ఆర్యుల గూర్చి, ద్రావిడుల గూర్చి తెలుసుకోవడమే కాదు. మొఘలుల కాలం గూర్చి, బ్రిటీష్ పాలన గూర్చి తెలుసుకోవడం కూడా కాదు. ఇంకా ఇంకా లక్షల సంవత్సరాల క్రితంలోకి వెళ్ళి ఈ భూమిమీద ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా చరిత్రే! నేటితరం యువతీ యువకులు ఆ విషయాలన్నీ తప్పక తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆధునిక కాలంలో వచ్చిన శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సత్యాన్వేషకులు ఎవరో, వారి కృషి ఏమిటో కూడా సమకాలీనంలో ప్రజలు సమీక్షించుకుంటూ ఉండాలి. వారి నుండి స్ఫూర్తిని పొందుతూ ఉండాలి. నేటి దేశ కాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు చేసిన ఈ విశ్లేషణలు జన చైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి! జననాడిని, జీవనాడిని పట్టుకోవడంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎప్పుడూ ముందే ఉంటూ వస్తోంది గనుక, మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది? శీర్షికన ఈ పుస్తకాన్ని పాఠకులకు సగర్వంగా అందిస్తూ వుంది.