
MANAVA JAATHI ANTHA OKA MISRAMA SANTHATHI
₹100
In stock · 557 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400576
వేల వేల ఏళ్ళ క్రితమే మిశ్రమ మానవ జాతి ఏర్పడింది. ఇంక పవిత్రులు, శుద్ధమైన వారు, సంకర జాతి - లాంటి పదాలకు అర్థమే లేదు కదా? మిశ్రమ జాతి నిజమైనప్పుడు మధ్య ఏర్పరుచుకున్న కుల గోత్రాలకు విలువ ఉంటుందా? జాత్యంహంకారానికి అర్థం ఉంటుందా? జీవశాస్త్ర ప్రకారం ప్రాణుల మధ్య లైంగిక సంపర్కం జరుగుతూ ఉందంటే, అవి ఒకే జాతికి చెందిన ప్రాణులని అర్థం! ఈ అత్యాధునిక కాలంలో కూడా అదే చూస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలే కాదు, వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజల మధ్య కూడా వివాహాలు చూస్తున్నాం. అంటే మానవజాతి అంతా ఒక్కటే అని అర్థం. కవి, సృజనాత్మక రచయిత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ దేవరాజు మహారాజు సమాజంలో వైజ్ఞానిక స్పృహను, మా'నవ' వాదాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. తొలి దశలో మానవజాతి వలసల మీద లోతుగా అధ్యయనం చేసిన వీరు, మానవజాతి అంతా ఒక మిశ్రమ సంతతి శీర్షికన ఇచ్చిన వివరణలు, చూపిన ఆధారాలు జన చైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి. లోగడ విశాలాంధ్ర ప్రచురించిన 'నేను' అంటే ఎవరు?-అనే వీరి పుస్తకానికి 2021- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జననాడిని, జీవనాడిని పట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటున్న విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఈ గ్రంథాన్ని సగర్వంగా పాఠకులకు అందిస్తోంది.