
MANCHI KATHA
₹240
In stock · 10 available
PublisherPRIYAMAINA RACHAITALU
LanguageTelugu
ISBN9789395615013
నా మాట ఎందరో కథకులు, అందరికీ వందనాలు 2022 సెప్టెంబరు 9, 10, 11 తేదీలలో సింహాచలంలో ఒక వేడుకగా రచయితలు జరుపుకొనే 'సాహిత్య సంబరాలు' లో మరో సంబరంగా ఒక కథా సంకలనం తీసుకురావాలనే మా ఆలోచనకు రూపకల్పనే ఈ 'మంచి కథ' (మినీ కథల సంకలనం) ప్రయత్నం. అందుబాటులో ఉన్నమేరకు వివిధ కథకుల నుండి పరస్పర సహకారంతో ఈ కథల సేకరణ జరిగింది. కథల విషయంలో 'వస్తు వైవిధ్యం' ప్రధాన అంశంగా మారింది. మన చుట్టూ ఉన్న సమాజంలోని వివిధ పార్శ్వాలను స్పృశించాయి ఈ కథలు. జలం జీవం, జలం జీవనాధారం. ఒకప్పుడు నింగి నుండి కురిసిన నీటిచుక్కని ఒడిసిపట్టి 'చెఱువు'గా మారిస్తే, నేడు అదే చెఱువుని మాయం చేసి భవనాలను సృష్టించే దళారుల మాయను ఎండగట్టింది "గుండె చెఱువై" అనే కథ. అధికారమడం ఎలా కళ్ళను కప్పేస్తుందో' పీడకల' వివరిస్తుంది. 'తల్లి ఋణం', 'అమ్మ మనసు' అనే కథలు చిన్నవే అయినా మనసు మూలల్ని కలుక్కుమనిపిస్తాయి. డబ్బు చేసే విన్యాసాలు 'డబ్బుదేముంది ?', 'వందనోటు' మొదలగు కథలలో జాలువారాయి. 'చెత్త లారీ', 'ఎందాకో ఈ పయనం', వంటి కథల్లో మానవత్వ పరిమళం గుబాళించింది. నిరుపేదల ముద్దుమురిపాలకు వేదికయ్యాయి 'పొద్దూ యాళే ఉండదు', 'సేకటడతన్నాది' కథలు. తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలియజేసింది 'జగతికి వెలుగు అమ్మ' అనే కథ.