MANCHI MANASULU by POLA PRAGADA RAJYALAKSHMI Telugu book cover

MANCHI MANASULU

by POLA PRAGADA RAJYALAKSHMI

₹150
In stock · 27 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
రామ్ రామ్ మాస్టారు! 'రామ్ రామ్ మాస్టారు! ఎప్పుడొచ్చారు?" అంటూ పలకరించాడు జోగయ్య, "నిన్ననే వచ్చానండి" అన్నాడు. "రామాలయంలో భజన రోజూ జరుగుతుందా?" అని అడిగాడు రామయ్యగారు. "లేదండి, కుర్రాళ్ళెవరో వస్తున్నారు గాని పెద్దాళ్ళు రావటం లేదు. రేపటినుండి మొదలుపెడదాం మీరంతా తప్పకుండా రండి. రోజూ బ్యాంక్లో మీ అబ్బాయిగారిని అడుగుతూనే ఉన్నాం మీ నాన్నగారు ఎప్పుడొస్తారని. ఏమో నాకు తెలీదు. ఆయనకి అందరూ చుట్టాలే. ఏ ఊళ్ళో ఎప్పుడుంటారో అన్నారు" అన్నాడు జోగయ్య. "మా అబ్బాయి అలాగే అంటాడు. నా కాలక్షేపం నేను చెయ్యాలి కదా! నిజంగా చెప్పాలంటే నేను ఈ ఊరు రావడానికి కారణం మా మనవళ్ళ కోసం, మీ అందరి కోసమూను. రేపు వస్తాను. సాయంకాలం భజన చేద్దాం. మనవాళ్ళందరినీ పిలువు" అన్నాడు రామయ్య. రాత్రి భోజనాలు అయ్యాక మనవళ్ళకి కాశీమజిలీ కథలు చెప్తున్నాడు.