
MANCHI MARGAM - 60
₹60
In stock · 494 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సూర్యచంద్ర! రామాపురం సత్రంలో కొంతసేపు విశ్రాంతి కోసం శ్రీనివాస సిద్ధాంతి ఆగారు. సత్రంలో గల నారాయణ, సిద్ధాంతిగార్ని చూసి “నా భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పండి" అర్థించాడు. సిద్ధాంతిగారు ఆలోచిస్తూ, మూలగా పడుకుని వున్న అబ్బాయిని చూశారు. "పాపం! అతడు అనాధలా వున్నాడు రెండ్రోజులు నుండి తిండి లేకుండా పడుకున్నాడు. ఆదుకుందామంటే నాకే ఆధారం లేదు. చెయ్యడానికి వ్యవసాయమూ లేదు వ్యాపారానికి పెట్టుబడీ లేదు. పని చేసుకు బ్రతుకుదామంటే ఎవరని ప్రశ్నిస్తున్నారు తప్ప, పనివ్వటం లేదు" ఏక కంఠంతో చెప్పుకుపోతున్నాడు నారాయణ. సిద్ధాంతిగారు కుర్రాడ్ని ఎగాదిగా చూసి “వీడికి మంచి భవిష్యత్తు వుందోయ్! చేతిమీద రేఖలు-నుదుటి మీద గీతలు వీడి జీవితానికి బంగారు బాటలు. వీడి ద్వారా నీక్కూడా త్వరలో అదృష్టం వస్తుంది. ఇద్దరూ భోజనం చెయ్యండి" అని కొద్ది డబ్బులు నారాయణ చేతిలో పెట్టి, పయనమయ్యారు సిద్ధాంతి. సుష్ఠుగా భోంచేసి సత్రానికి వచ్చారు నారాయణ - కుర్రవాడు. ఈలోగా సత్రంలో ముగ్గురు ఉద్దండులు కలిశారు. వారిలో ఒక వ్యక్తి పేరున్న వైద్యుడు. రెండో వ్యక్తి గొప్ప పండితుడు. మూడో వ్యక్తి బాగా ధనికుడు. ముగ్గురూ తమ తమ గొప్పలు వల్లించుకుంటున్నారు. నారాయణ - కుర్రవాడు శ్రద్ధగా వింటున్నారు “డబ్బుతోనే లోకం వుంది. డబ్బు ఆడించినట్టే లోకం ఆడుతుంది. అందుచేత నా వద్ద వున్న డబ్బు చాలా గొప్పది” ధనికుడు చెప్పాడు. "చాలా పొరబాటు. అసలు మనిషి బ్రతికుంటే కదా! అన్ని సుఖాలనుభవించేది. మనిషి ప్రాణాలు నిలుపుతున్న నా వైద్యం చాలా గొప్పది” వైద్యుడు అన్నాడు.