
MANCHI NIDRA
₹300
In stock · 3 available
PublisherSRI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788190900720
ముందు మాట చూసినకొద్దీ చూడాలి అనిపించేవి కొన్ని ఉంటాయి. విన్నకొద్దీ వినాలి అనిపించేవి మరికొన్ని ఉంటాయి. కానీ చదివినకొద్దీ చదవాలనిపించేవి చాలా కొద్దిగా ఉంటాయి. అలా ఆ 'కొద్ది'కోవకు చెందినదే ప్రముఖ మానసిక వైద్యులు డా. పమిడి శ్రీనివాస తేజ కలం నుండి జాలువారిన అమూల్య గ్రంథం “మంచి నిద్ర” నిద్ర అంటే చీకటి పడ్డాక బెడ్ ఎక్కేయడమే కదా, ఆ పైన ఆటోమాటిక్ గా కళ్ళు మూతపడటమే కదా అని అనుకుంటారు కొందరు. కానీ బెడ్ ఎక్కినా కళ్ళు మూతపడనివారు ఎందరో?. నిద్ర కోసం వారు పడే వేదన అంతా ఇంత కాదు. ఎంతకీ నిద్ర పట్టని వాళ్ళ బాధ వింటే, నిద్ర ఎంత అవసరమో అర్థం అవుతుంది. చీకటి పడ్డాక ఓ ఝాము గడిచిన తరువాత రోడ్డు మీద నడుస్తూ పోతూ ఉంటే ఫుట్పాత్ మీద ఆదమరచి నిద్ర పోయే నిర్భాగ్యులెందరో కనపడతారు. కార్ల రొద, డప్పుల మోత వీళ్ళకి నిద్రాభంగం కలిగించలేవు. వాళ్ళు నిర్భాగ్యులైనా నిద్ర విషయంలో భాగ్యవంతులే. రోజుల తరబడి నిద్రకోసం పరితపించే వాళ్ళు, వీళ్ళని చూసి ఈర్ష్య చెందుతారు. ఎందుకంటే వీళ్ళకి లేని భాగ్యం వాళ్ళకి ఉంది కనుక. "ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు" అనే నానుడి ఉంది. అది అక్షరాలా నిజం. నిజంగానే నిద్ర ముంచుకు రావాలిగాని రాళ్ళగుట్టయినా నడుం వాల్చేయటమే. ఆ రాళ్ళ గుట్టే పూలపాన్పు అనిపిస్తుంది. నిద్ర ముంచుకొస్తే ఇక ఏదీ అడ్డు రాదు. నిద్ర పట్టని వాళ్ళకి మెత్తని మఖమల్ పరుపు కూడా చిరాకు కలిగిస్తుంది. పరుపు మీద దొర్లి దొర్లి, చివరకు విసుగుతో ఆరుబైటకు పోవటం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నిద్ర సుఖం అంతా ఇంతా కాదు. నిద్ర లాభం చెప్పలేనంత. డా. శ్రీనివాస తేజ రాసిన “మంచి నిద్ర”- మంచి నిద్రకు మార్గాలు పుస్తకంలో ఎన్నో శాస్త్రీయ విషయాలని గొప్పగా, సరళంగా, అందరికీ అర్థం అయ్యేలాగా, ఆసక్తి రేకెత్తించే విధంగా వివరించారు. వీరు రాసిన ఈ పుస్తకం నిద్ర గురించి ఎన్సైక్లోపిడియా అని చెప్పవచ్చు. తెలుగులో ఇంతవరకూ నిద్ర గురించి ఇంత వివరంగా ఏ పుస్తకమూ కాలేదు. సాధారణంగా శాస్త్రీయ విషయాలని వివరించే గ్రంధాలు పాఠకులని అంతగా ఆకట్టుకోలేవు. కానీ డా. శ్రీనివాస తేజ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా చదివింపజేస్తుంది. మంచి నిద్ర