
MANCHI PADYALU - 40
₹40
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మంచి పద్యాలు 1. ఎఱుక గలవారి చరితలు గఱచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెఱుగుచు, నెఱిగిన దానిని మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్ నన్నయ సూక్తి రత్నాలలో ఇది ఒకటి. ధర్మాచరణ అన్నిటికంటే అవసరమని స్పష్టంగా చెప్తున్న పద్యం ఇది. "తెలివి గలవారి ప్రవర్తనల్ని అనుసరించాలి. మంచివాళ్ళతో గోష్ఠిలో పాల్గొంటూ ధర్మాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే చాలదు తెలుసుకొన్న ఆ ధర్మాన్ని తగిన విధంగా ఆచరించాలి" అన్నాడు నన్నయ. అంటే ఆచరణకి పనికిరాని జ్ఞానం వ్యర్ధమని తాత్పర్యం. 2. ద్యుమణి పద్మాకరము వికచముగజేయు కుముద హర్షంబు గావించు నమృతసూతి అర్థితుడు గాకజయమిచ్చునంబుధరుడు సజ్జనులు దారె పరహితాచరణమతులు పరోపకారం మానవులకి అత్యవసరమంటూ భర్తృహరి సంస్కృతంలో చెప్పగా - ఏసుగు లక్ష్మణ కవి తెలుగులో పై పద్యం చెప్పాడు. "సూర్యుడివల్ల తామరపువ్వులు, చంద్రుడివల్ల కలువ పూవులు వికసిస్తున్నాయి. మరి ఆ పువ్వులు రోజూ మాకు సహాయం చేయండి అని సూర్యచంద్రుల్ని కోరుతున్నాయా? మేఘాలు ఎవరో అడిగినా