
MANCHI UPANYASAKUDANTE EVARU ?
₹90
In stock · 1 available
PublisherJAYANTHI PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట విద్యార్థులూ, యువకులూ అనేక రంగాలకు చెందిన మిత్రుల సహకారం వలన గత 40 సంవత్సరాల నుంచీ, ఉపన్యాసాలూ, క్లాసులూ చెప్తూ ఇప్పటికి చిన్న సైజు ఉపన్యాసకునిగా మరాను. అనేక మంది గొప్ప ఉపన్యాసకులనబడేవారి ఉపన్యాసాలు వినే అదృష్టం కలిగింది. ఇన్నాళ్ళు గడిచేక "ఉపన్యాసాలివ్వటం అనేది" ఒక కళే కాదు, సైన్సు కూడా అనే అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత ఇంగ్లీషులో దొరికిన పుస్తకమల్లా చదివాను. తెలుగులో ఒక చిన్న పుస్తకమైనా లేకపోవటమనే కొరత నన్ను ఇబ్బంది పెట్టింది. యువజన, రాజకీయ కార్యకర్తలుగా కాదల్చుకొన్న వారికి ఈ అవవసరం చాలా ఉందనిపించింది. కానీ, నా కంటే పెద్ద ఉపన్యాసకులు అసంఖ్యాకులున్నారు. కానీ వారెవరూ ఈ ప్రయత్నం చేసేంత తీరిగ్గా లేనందున నాకీ అవకాశం దొరికింది. ఇందులో అనేక మంది ఉపన్యాసాలను ఉపయోగించుకున్నాను. వారి పేర్లు కావాలనే రాయలేదు. అనుకూలమైన రెఫరెన్సుగా ఉపయోగించు కున్నప్పుడు, అది "అభినందన" కాబట్టి. ఆ ఉపన్యాసకుడు ఇబ్బందిపడడు. చాలా సార్లు సంతోషించువచ్చు కూడా.' కానీ ప్రతికూల రెఫరెన్సుగా ఉపయోగించినప్పుడు అది తప్పు పట్టటంతో సమానం కాబట్టి, అనేక మందికి ఇష్టం ఉండదు. బాధపడ్డారు కూడా. "తప్పపట్టిన వాడే నీకెక్కువ ఉపయోగపడ్తాడు”. అనేదెంత సరైందే అయినా, చాలా మంది కది ఇష్టముండదు. ఈ కారణంతో ప్రతికూల రెఫరెన్సుగా ఉపయోగించినప్పుడు పేర్లు రాయలేదు. దీన్ని చదివిన తర్వాత మంచీ, చెడు ఉపన్యాసాలూ తమ తమ అనుభవాలలో వున్నవి నాకు పంపితే తర్వాత వాటిని ఈ పుస్తకాన్ని అభివృద్ధి చేయటానికుపయోగిస్తానని మనవి చేస్తున్నాను. దీన్ని తయారు చేయటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకెంతో అనుభవాన్నందించి సహకరించిన నా కంటే పెద్ద వారికీ, చిన్న వారికీ, సహ ఉపన్యాసకులకూ, అందరికీ వందనాలు. ఎవరినైనా మనసు నొప్పించి -ఉంటే, ఆ నొప్పించే పని కావాలని చేసింది కాదనీ, తామా విధంగా "ఔత్సాహికులు" మంచి ఉపన్యాసకులుగా తయారు కావటానికి సాయపడ్డారని గమనించి, నన్ను మన్నించమని విన్నవించుకుంటున్నాను.