MANISHI DONGA NIJAMGA by VALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS) Telugu book cover

MANISHI DONGA NIJAMGA

by VALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)

₹100
In stock · 14 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
నేనూ... దొంగనే!? నేను ఎదుటివాణ్ణి అగౌరవపరిచేటప్పుడు, అతన్ని చులకనగా చూసేటప్పుడు, అతనిపై నిందలు మోపేటప్పుడు, నేరారోపణలు చేసేటప్పుడు : నేను కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అలా ఆలోచించగా ఎదుటివాడి కన్నా నాలోనే ఎక్కువ అవలక్షణాలు కనిపించాయి- అప్పుడనిపించింది... నేను కూడా దొంగనే.... 'మనిషి దొంగ' నిజంగా..!! ఎందుకంటే? మన జీవన విధానంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. మనం జీవించాలంటే భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతి చాలు మనం మనుషులుగా జీవించడానికి- అలా జరగడం లేదు!? మన మనుగడ, సాధించాలంటే నిత్యం ఈ జీవనవిధానంలో యుద్ధం చేయక తప్పటం లేదు- అందుకే మనిషి దొంగగా మారాడు. అమ్మ ఉగ్గుపాల నుండే పసిహృదయం స్వచ్ఛంగా పెరిగి పెద్దదైందా లేదా అన్నదే నాకు సందేహం? అక్కడి నుండే మొదలైందా అనిపిస్తుంది!? లేదు! అమ్మపాలు-అమృతం కన్నా గొప్పవి. ఈ రోజుల్లో అమ్మ పాలు కరువై... పోతపాలు మన కడుపులో పడ్డప్పుడే... మన మనస్సు కల్తీగా మారిపోయి... దిక్కుమాలిన! కాలిబూడిదైయ్యే ఈ శరీరం ఎంతో స్వార్థపూరితంగా పెరిగి పెద్దదైంది.