
MANOVIKASAM - MANASU MATA VINTUNDA
₹200
In stock · 400 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126054
నా మాట మనో విజ్ఞాన శాస్త్రము మానసిక సమస్యలను గుర్తించి శతాబ్దాలు గడుస్తున్నవి. 1845 ప్రాంతంలో క్వాన్స్టాట్, ప్యూస్టర్ లెబెన్ లాంటి శాస్త్రవేత్తలు వీటి గురించి వివరించారు. క్రీపెలిన్, బ్లలూర్ మొ॥వారు స్కిజోఫ్రెనియాలాంటి జబ్బులకు ముఖ్య లక్షణాలను నిర్ధారించారు. ఆధ్యాత్మిక కారణాలను ప్రారంభించి బ్రెయిన్ వ్యాధి కారకంగా తిరిగి కొన్ని లక్షణాలు (డెల్యూషన్స్, హాలిసులేషన్స్) అపసవ్య ఆలోచనలు మరియు జెనిటిక్, బయోలాజికల్ కారకాలు, న్యూరోట్రాన్స్ మీటర్స్ మరియు వ్యక్తికారకాలు మొ॥నవి కారణాలుగా భావించే దశకు వచ్చింది. సుమారు 460 బిసిఇ నుంచి 370-277 బిబిఇ వరకు నివసించిన 'వైద్యశాస్త్ర : పితామహుడు' హిప్పోక్రేట్స్ అప్పుడే మానసిక సమస్యలకు కారణాలు అతీతశక్తులు కాదని, శరీరంలో ఉండే బ్రెయిన్ మరియు వ్యక్తిగత కారణాలుగా నిర్ధారించారు. శతాబ్దాల తరబడి మానసిక సమస్యలపై శాస్త్రీయ పరిజ్ఞానము పెరిగి మెరుగైన వైద్య పద్ధతులు కనుగొనబడుతున్నాయి. కానీ దురదృష్టము ఏమిటంటే ఇప్పటికీ ప్రజలకు మానసిక సమస్యలపై అవగాహన కల్పించలేకపోతున్నారు. దానివల్ల శారీరక సమస్యలపై ఉన్న శ్రద్ధ మానసిక సమస్యల గురించి స్పందించడం లేదు. వ్యక్తి, కుటుంబము, సమాజము చాలా నష్టపోతున్నారు. సామాన్య ప్రజలకు సైతం కొంతైనా అవగాహన కల్పించే ప్రయత్నమే మనోవికాసము అనే ఈ పుస్తకము. గ్రాంథికంగా ఉండాల్సిన పుస్తకం వాడుక భాషలో రాయడము వలన అక్షర దోషాలు ఉండవచ్చును. అందుకు క్షమాపణలు. మానసిక సమస్యల గుర్తింపు, వైద్యపద్ధతులు ట్రీట్మెంట్ మొ॥నవి సరళ భాషలో చెప్పడం జరిగింది. నేను ప్రస్తావించిన అంశాలు స్వల్పము. ఇంకా చాలా ఉంది. మీ సహకారము, ఆశీర్వాదము ఉంటే భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలను మీ ముందుకు తెస్తానని మాటిస్తున్నాను. పుస్తక రచనలో తోడ్పడిన నా గురువులు డా||ఎన్.వి. రమణరావు, నా శ్రేయోభిలాషులు డా॥ శంకర్, డా॥ రాజేశ్వరరావు, డా॥ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డా॥ సురేష్, డా॥ ఫణి భూషణ్, డా॥ టి. శ్రీనివాస్, డా॥ సమరం, విశాలాంధ్ర దినపత్రిక యాజమాన్యానికి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్ బాబు, సిబ్బందికి, ముఖ్యంగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ గడ్డం కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. అలాగే సంపూర్ణ సహకారం అందించిన సీనియర్ జర్నలిస్ట్ టి.వి. సుబ్బయ్య, నాగార్జున యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మిత్రులు ఎస్.ఎ. రహమాన్, నా జీవిత భాగస్వామి డా|| డి.సుజాత, నా ప్రియమైన కుమార్తె డా॥ వెన్నెల, అల్లుడు డా|| విఘ్నేష్ మరియు కుటుంబ సభ్యులకు, మిత్రులకు కృతజ్ఞతలు. సదా మీ ప్రేమాభిమానములను ఇదే విధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ...