MARO CHARCHA by RACHAPALEM CHANDRASHEKARA REDDY Telugu book cover

MARO CHARCHA

by RACHAPALEM CHANDRASHEKARA REDDY

₹100
In stock · 33 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పుస్తకంలోని మొదటి వ్యాసం తప్ప తక్కినవన్నీ 2006 తర్వాత 2010 లోపల అయిదేళ్ళలో రాసినవి. ఈ అయిదేళ్ళలో రాసిన దాదాపు సలభై వ్యాసాల్లోంచి ఇరవై ఆరు వ్యాసాలను ఎంపికచేసి 'మరో చర్చ' గా ఈ సంపుటం తెచ్చాను. 2006లో "చర్చ" వచ్చినప్పుడు పాఠకులు, విమర్శకులు దానిని విశేషంగా గౌరవించారు. చాలా మంచి సమీక్షలు వచ్చాయి. ఎందరో ఫోన్లో అభిప్రాయాలు చెప్పారు. అప్పుడు తెలుగుసాహిత్య విమర్శ మీద ఇంకా కృషి చెయ్యవలసిన అవసరం ఉందనిపించింది. దాని ఫలితమే ఈ పుస్తకం. కనీసం వందమంది తెలుగు సాహిత్యవిమర్శకులను గురించైనా ఇలా రాయవలసిన అవసరం ఉంది. తెలుగు సాహిత్యవిమర్శ మీద ఎంత అసంతృప్తి ఉన్నా, సాహిత్య విమర్శ వస్తున్నంతగా దాని మీద విశ్లేషణ జరగడం లేదు. సాహిత్య విమర్శకులు ఉన్నట్లుగా, విమర్శ విమర్శకులూ ఉండాలేమో అనిపిస్తుంది. ఇటీవల నామిత్రుడు ఆచార్య వి. సిమ్మన్న ఈ దృష్టితో కొంత కృషి చేస్తున్నారు. డా|| లక్ష్మణచక్రవర్తి తెలుగు సాహిత్యవిమర్శను ప్రారంభం నుంచి క్రమంగా సేకరించి అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పుస్తకంలో చాలా వ్యాసాలు వర్తమాన సాహిత్యవిమర్శ, విమర్శకులపైన రాసినవే అయినా, తిమ్మావజ్ఝల కోదండరామయ్య, జయంతి రామయ్య, గుర్రం వెంకట సుబ్బరామయ్య వంటి పూర్వ విమర్శకులను గురించి కూడా చదివి రాయడం నాకు చాలా సంతోషం వేసింది. ఈవ్యాసాలను ప్రచురించిన పత్రికలవారికి, ప్రాణహిత వారికి ధన్యవాదాలు. ఈ వ్యాసాలను డిటిపి చెయ్యడంలో సహకరించిన మిత్రులు గిరిధర్కు, హరిభూషణరావుకు ధన్యవాదాలు. నా కోరికను మన్నించి ఈ పుస్తకాన్ని ప్రచురించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి మనః పూర్వక కృతజ్ఞతలు,