MARO KONAMLONCHI MAHATHMUDU by KODURI SRIRAMA MURTHY Telugu book cover

MARO KONAMLONCHI MAHATHMUDU

by KODURI SRIRAMA MURTHY

₹70
In stock · 48 available
PublisherKODURI SRIRAMA MURTHY
LanguageTelugu
రెండు మాటలు.... గాంధీజీపై ఇది నేను రాసిన అయిదో పుస్తకం. గాంధీజీ శత జయంతి సంవత్సరంలో (1969) ఆంధ్రజ్యోతి వారపత్రిక కోసం గాంధీజీ జీవితంలోని ఆసక్తికర ఉదంతాలను గుదిగుచ్చి రాశాను. దానిని పత్రికవారు "గాంధీజీ కథావళి" అనే పేరుతో ఆ రోజుల్లో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక శీర్షికగా వెలువరించారు. ఆ శీర్షిక అప్పట్లో మేథావుల నుండి సాధారణ పాఠకుల వరకూ అందరినీ విశేషంగా ఆకట్టుకుని గ్రంధ రూపంలో వెలువడింది. దానిని ఇటీవల చాలాకాలం తర్వాత విశాలాంధ్ర వారు పునర్ముద్రిస్తే అది కూడా విశేషంగా పాఠకులకు ఆకట్టుకుంది. ఆ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తితో మరో నాలుగు పుస్తకాలు గాంధీజీపై రాయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అయితే- అప్పుడు నేను ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించవలసి వుంది కనుక, - ఉన్న తీరిక నా సాహిత్య కార్యక్రమాలకు నియోగం కావలసిరావడంచేత, సాహిత్య విమర్శకు ఇచ్చిన ప్రాధాన్యతను గాంధేయ సాహిత్యానికి ఇవ్వలేకపోయాను. ఉద్యోగం నుండి విశ్రాంతి పొందిన తర్వాత ఈ కృషిపై శ్రద్ధ వహించాను. మొదటగా - "ఈనాడు" దినపత్రికలో దాదాపు వరుసగా గాంధీజీ ఆలోచనలను, ప్రస్తుత సమాజంలో వున్న జుగుప్సాకర వాతావరణాన్ని సరిపోలుస్తూ చాలా వ్యాసాలు ఎడిటోరియల్ పేజీలో రాశాను. ఆ తర్వాత అవన్నీ "ఆలోచన" అనే పేరుతో గ్రంథరూపంలో ప్రచురిస్తే పెద్దలందరూ దానిని మెచ్చుకున్నారు. ఆ తర్వాత - విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ వారి కోసం గాంధీజీ జీవితంలోని వివాదాస్పద అంశాలను తీసుకుని (ఆయన బ్రహ్మచర్య సిద్ధాంతం, మతం రాజకీయం, కుటుంబ జీవితం, మొదలగు పలు అంశాలు) "మనకు తెలియని మహాత్ముడు" అనే పేరుతో ఒక పుస్తకంగా రాశాను. గాంధీజీ జీవితంపై గల అపార్థాల ముడివిప్పే పుస్తకం ఇది. ఆశించినట్టుగానే ఈ పుస్తకం కూడా విజయాన్ని సాధించింది. ఇది గాంధీజీపై నేను రాసిన మూడవ పుస్తకం. ఇక, - గాంధీజీపై నేను రాసిన నాలుగవ పుస్తకం "మహాత్ముని ప్రస్థానం”. దీనిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గాంధియన్ స్టడీ సెంటర్ వారి కోరికపై రాశాను. ఆ పుస్తకాన్ని వారే ప్రచురించారు. ఈ పుస్తకంలోని ప్రత్యేకత ఏమిటంటే- ఇది దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలపై రాసిన పుస్తకం. గాంధీజీ జీవితంలో ఆయన దక్షిణ ఆఫ్రికా జీవితం అత్యంత కీలకమైన భాగం. ఈ జీవిత భాగంలోని అనుభవాలే మోహన్దాస్ కరంచంద్ గాంధీ అనే ఒక సాధారణ బారిస్టర్ని మహాత్ముణ్ణి చేశాయి. కాని, దురదృష్టం ఏమిటంటే గాంధీజీ దక్షిణ ఆఫ్రికా జీవితాన్ని గురించి గాని, ఆయన అక్కడ నిర్వహించిన పలు ఉద్యమాల గురించిగాని, వివరాలు చెప్పే పుస్తకం ఏదీ తెలుగులో రాలేదు. ఆలోటును ఈ పుస్తకం తీరుస్తుంది.