
MARO MAHATMA
₹250
In stock · 89 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400194
MARO MAHАТМА (Campus Novel) by Dr. Gujju Chenna Reddy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కాదని ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ఆచార్యునిగా సేవలందిస్తున్న గుజ్జు చెన్నారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రెండు పిహెచ్.డిలు అందుకున్నారు. 186 పరిశోధక వ్యాసాలు వ్రాసి, తన గైడెన్స్లో 35 డాక్టరేట్లు పూర్తి చేయించి, డిగ్రీ, హైస్కూల్ ఇంగ్లీష్ టెస్ట్ బుక్స్ రాసి, తెలుగు దినపత్రికలకు కాలమిస్ట్, ఆలిండియా రేడియో, దూరదర్శన్లకు ఉపన్యాసకునిగా సేవలందించిన ఇతని మొదటి పుస్తక రచన 'సిక్కోలు కథలు', మొదటి నవల 'మరో మహాత్మ'. కేంపస్ జీవిత అనుభవం కోకొల్లల మందిది. నేడు శత వసంతాలకు చేరువౌతున్న ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకున్న వారు ఎందరో. అందులోని కొందరు ఉన్నతమైన ఆత్మగల మహాత్ములు. ప్లేటో ప్రతిపాదించిన ఆదర్శరాజ్యం కావాలని కలలుకని కలత చెందినవారు మరికొందరు. కేంపస్ లైఫ్లో ఆడిపాడి, చిలిపితనంతో గడిపి, దేశమే ఆదర్శరాజ్యంగా ఉండాలన్న ఆలోచన నరనరాన జీర్ణించుకుని వారు వేసే పాదాలకు గుచ్చుకున్న ముళ్ళను తీస్తూ, రక్తపుమడుగులో అడుగులేస్తూ కన్నీరు, కడగండ్లను దిగమింగుతూ నవసమాజ స్థాపనకు సమిధలైపోయిన వారు కొందరు. కేంపస్ లైఫ్ ని ప్రేమ, జ్ఞానం, కర్తవ్యం, బాధ్యత, ఆరాధన, ఆగడాలు పాఠకులను ఆరోజుల్లోకి తీసుకెళ్ళి గిలిగింతలు పెడతాయి. కొండలనైనా పిండిచేసి దేశం రూపురేఖలు మార్చేయాలన్న సామాన్యులు మరోమహాత్ములుగా ఎలా మారారన్న కథే ఈ “మరో మహాత్మ”. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-19-4