
MARO MARX PUTTALE
₹50
In stock · 161 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పుస్తకం గురించి మొట్టమొదట గుర్తించవలసినది ఈ కథల్లో అత్యధిక భాగం కొత్త జీవిత పార్శ్వాలను చిత్రించిన, విశదీకరించిన, విశ్లేషించిన కథలు. ఈ పద్నాలుగు కథల్లో పది కథల ఇతివృత్తాలు పూర్తిగా కొత్తవి. కనీసం ఇరవైఏళ్ళ కింద ఉండడానికి అవకాశం లేనివి. ఆ ఇతివృత్తాలు తెలుగు సమాజంలోకి కొత్తగా ప్రవేశించిన జీవనరంగాలకు, వృత్తులకు, వాటివల్ల మానవ సంబంధాలలో వచ్చిన మార్పులకు సంబంధించినవి.... ఆ కథలలో చిత్రణ పొందిన స్త్రీల సమస్యలు గతకాలపు స్త్రీల సమస్యలలాంటివి కావు. అవి ఇటీవలి సామాజిక మార్పులతో ప్రభావితమైన స్త్రీల సమస్యల గురించిన కథలు. ....స్త్రీల మీద అత్యాచారాలు, అమెరికా పెళ్ళికొడుకుల కట్నాల ఆశలు, అమెరికాలో స్థిరపడి కూడా తమ వంతు భూమికోసం దురాశలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పనిఒత్తిడిలో ఛిన్నమైపోతున్న స్త్రీ పురుష సంబంధాల సున్నితత్వం, పేదరైతుల భూములను సేకరించడంలో ప్రభుత్వ మోసాలు, రక్తబంధంకన్న రాజకీయలబ్ధిదే పైచేయికావడం - సరుకుల అమ్మకాల క్రీడలో బహుళజాతి సంస్థల మోసాల లాంటి - అనేక అంశాలను సుజాతారెడ్డి గారు చాలా ఆలోచనాస్ఫోరకంగా చిత్రించారు, విశ్లేషించారు.