
MARO PRASTHANAM
by SRI SRI
₹100
In stock · 779 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
“మా నమ్మకమే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30న 1910లో విశాఖపట్టణంలో జన్మించారు. 1931లో బి.ఏ. పూర్తి చేసిన శ్రీశ్రీ–ఎ.వి.యన్. కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా, మద్రాసు ఆంధ్రప్రభలో లేబరేటరీ అసిస్టెంట్‌గా, వివిధ ఉద్యోగాలు చేసిన తన సంత భవాల కారణంగా దేనిలోనూ ఇమడలేక, సినీరంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ 1950లో పుస్తక రూపం దాల్చింది. 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ‘ఖడ్గసృష్టి’ కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మెడటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15న, 1983లో మహాప్రస్థానమయ్యారు.