MARO PRAVAHAM ANUKSHANAM by V.RAJARAMMOHANA RAO Telugu book cover

MARO PRAVAHAM ANUKSHANAM

by V.RAJARAMMOHANA RAO

₹50
In stock · 153 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
MARO PRAVAAHAM ANUKSHANAM V. RAJA RAMA MOHANA RAONOVELS నిద్దర్లేచిన దగ్గర్నుంచీ పడుకునే వరకు మనకు నిత్యం తప్పకుండా ఎదురయ్యే, కనిపించే మనుషులే వీళ్లు! వీళ్లు మనకి దరిద్రంగా, జుగుప్సగా, ఒక్కోసారి కోపం తెప్పించేలా వుంటారు. సంఘంలో వీళ్ల సంఖ్య చాలా ఎక్కువే అయినా మనం, మన సాహిత్యంలో వీళ్లని ఎక్కువగా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. కానీ ఈ రకం మనుషుల గురించి ఆర్తిగా, తోటి మనుషులుగా ప్రస్తావించి, పలకరించి అక్షర సత్యాలుగా చెప్పింది ఒక్క రాజారామ మోహనరావే! వి. రాజారామ మోహనరావు ఉంటున్నది హైదరాబాద్ లో. ఇప్పటిదాకా 16 నవలలు, 180 కి పైగా కథలు ప్రచురించారు. తొలి కథా సంపుటి "వరద" ( ఎమెస్కో - 1975) విస్తృత ప్రాచుర్యం పొందింది. రెండవ కథల సంపుటి "తెల్లటి చీకటి" యీ మధ్యే విడుదలైంది. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో కథలకు 16 సార్లు, నవలలకి 4 సార్లు బహుమతులు పొందారు. అందులో 1979 లో విశాలాంధ్ర ప్రచురణాలయం నిర్వహించిన నవలల పోటీల్లో "మనిషికీ మనిషికి మధ్య" నవలకు ప్రథమ బహుమతి లభించింది. 30కి పైగా కథలు, ఒక నవల ఇతర భాషల్లోకి అనువదింపబడి ప్రచురింపబడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రచురితమైన జ్ఞానపీఠ్, సెంట్రల్ హిందీ డైరక్టరేట్ "వార్షికి”, కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి పలు సంస్థలు ప్రచురించిన సంకలనాల్లో వీరి కథలు చోటుచేసుకున్నాయి. శాలాంధ్ర పబ్లిషింగ్ VPH01100348