MARXIST NIGHANTUVU 1 TATWASASTRA VIBHAGAM by RAO KRISHNA RAO Telugu book cover

MARXIST NIGHANTUVU 1 TATWASASTRA VIBHAGAM

by RAO KRISHNA RAO

₹350
In stock · 142 available
PublisherLEFTIST STUDY CIRCLE
LanguageTelugu
ముందు మాట వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్పిస్టు నిఘంటువు' - తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు- తెలుగు) అనే ఈ బృహత్ గ్రంథాన్ని తెలుగు పాఠకుల ముందుంచుతున్నది (రెండవ భాగంగా 'రాజకీయార్థికశాస్త్ర విభాగం'ను తీసుకురానుంది). నిజానికి ఈ బృహత్ కార్యక్రమం అన్ని విధాలా మా స్థాయికి మించినది. మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకూగల ఇలాంటి అవసరాన్ని గుర్తించి, దాన్ని ఎంతో కొంతమేర తీర్చాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి పూనుకున్నాము. అయితే ఇది అలాంటి అవసరాన్ని తీర్చగల పరిపూర్తి (అసలు అలాంటిదంటూ వుండదనుకోండి) గ్రంథమేమీ కాదు. కేవలం ఓ చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే. ఇంకా ఇలాంటి ప్రయత్నాలెన్నో జరగాల్సి వుంది. ఆ వైపుగా ఎంతో కొంత ఉపయోగపడితే మా ఈ ప్రయత్నం ఆ మేరకు సఫలమైనట్లే. ఇక ఈ గ్రంథానికి సంబంధించి పాఠకులకు తెలియజేసేదేమంటే, ఇందులో దాదాపు అయిదు వందల యాభైకి పైగా ఆరోపాలు/ ప్రవేశికలు (entries) ఉన్నాయి. గ్రంథ విస్తరణభీతి దృష్ట్యా ఇప్పటికి ఇంతవరకే పరిమితమైనాము. వీటిని వివిధ మూలగ్రంథాల నుండి తీసుకున్నాము. (ఆధార గ్రంథాల పేజీ చూడగలరు). వీటిలో కొన్ని ఆరోపాలు మార్క్సిస్టు తాత్విక పరిధికి వెలుపలివిగా అనిపించినా, పాఠకులకు కొంత అదనపు సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే చేర్చాము (ఈ అన్ని ఆరోపాలలోని వివరణలను, నిర్ధారణలను మా సంస్థ అభిప్రాయాలుగా భావించవలదు. ఇందులోని సమాచార వైవిధ్యతను అందించడానికి కేవలం మేము వాహకులం మాత్రమే). అలాగే ఈ గ్రంథ కూర్పులో మేము ఆంగ్ల భాషావర్ణక్రమాన్ని అనుసరించాము (ఇంగ్లీషు - తెలుగు వర్ణక్రమ సూచిక (Glossary) ను గ్రంథం చివరలో ఇచ్చాము). ఇందులోని కొన్ని ఆరోపాలు ఓ చిన్న పేరాకు మాత్రమే సరిపోయే వివరణతో ముగియగా, మరికొన్ని ఓ వ్యాసస్థాయికి సంతరించుకున్నాయి. విషయంలోని జటిలత, సంక్లిష్టతల దృష్ట్యానూ, ఆయా పదాలలోని కొన్ని ప్రామాణికత, నిర్దిష్టతలు అంతంత మాత్రంగానే తెలుగులో జరిగిన దృష్ట్యానూ, పాఠకులు కూడా ఇలాంటి విషయాలలో తగినంతగా ప్రత్యేక కృషి చేయాల్సి వుంటుంది. శాస్త్రాల అధ్యయనంలో ఇలాంటిది అనివార్యం కూడాను. పాఠకులు తమ అధ్యయనం తర్వాత మరిన్ని సూచనలు, సలహాలు మాకందించినట్లయితే వాటిని స్వీకరించి, మరింత నిర్దిష్టంగానూ, మరిన్ని ఆరోపాల చేర్పుతోనూ తదుపరి ముద్రణను తీసుకురాగలము. అందుకు సహకరించవలసిందిగా పాఠకులను కోరుతున్నాము. ఇక ఈ గ్రంథ కూర్పులో శ్రీ రావు కృష్ణారావుగారి కృషిని ప్రత్యేకంగా చెప్పవలసి వుంది. ఆయన తనకున్న నిబద్ధత వల్లనే సుమారు రెండు సంవత్సరాలపాటు దీనిపై కఠోరశ్రమ చేశారు.