
MATALA MUCCHATLU
₹30
In stock · 2 available
PublisherDR.G.V.PURNACAHND
LanguageTelugu
అడుగు 'వెడవెడ నడకలు నడచుచు నెడనెడ నడుగిడఁగ...." అనే పోతన గారి పద్యం వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు అడుగిడ్తున్న సందర్భంలోది 7 అడుగడం' కోసం. దానం అడుగు అనేసరికి అనేక అర్థాలు కనిస్తాయి. అడిగినకొద్దీ అర్ధాలు పుట్టుకొస్తాయి. అడుగు అంటే పాదం: 'అడుగు చెమ్మటలాడు' అంటే, అచ్చతెలుగులో విష్ణుమూర్తి అని ! సంస్కృతానికో, వేదభాషకో సంబంధించిన ఈ విష్ణువు పదాన్ని తెలుగులో చెప్పాలంటే, ఇలా కష్టపడి రూపొందించుకోవాలి. విష్ణువు పాదాలలోంచి గంగ పుట్టింది కాబట్టి. ఆయన్ని అడుగు చెమ్మటలవాడు అని పిలిచారు. అడుగు వాక గలాడు అని కూడా అంటారు. మనం అడుగు పెట్టగానే పోయిన కరెంట్ వచ్చిందనుకోండి మన అడుగు - మహత్యాన్ని అందరూ హర్షిస్తారు. "అడుగులానబెట్టి - చెప్తోన్నా..." అంటే, ఒట్టేసి చెప్తున్నానని...! పాదాల అడుగులకు మడుగులొత్తే వారిని 'అడుగు గులాములు' అంటారు. అడుగుతీసి అడుగు పెట్టలేనంత మంది జనం వచ్చారంటారు. అడుగు తీసేశాడు అంటే, చేస్తున్నపని మధ్యలో వదిలేశాడని. అడుగు తడబడితే, నృత్యప్రదర్శనే కాదు జీవితంలో ప్రతిదీ రసాభాసే అవుతుంది. ఎన్నిట్లో 'అడుగు పెడతావయ్యా!' అనడుగుతాం... ఎందులోనూ పరిపూర్ణత సాధించలేనివాణ్ణి! దుర్వాసుడు, గౌతముడూ వంటి మహర్షులకు పాదాలలో కళ్ళున్నా యని,